Daily Horoscope 03-01-2022

0
Daily Horoscope 03-01-2022
Daily Horoscope 6/02/2022

Daily Horoscope 03-01-2022

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

03, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
పుష్య మాసము
శుక్ల పాడ్యమి
ఇందు వాసరే (సోమవారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మొదలుపెట్టిన పనుల్లో చిత్తశుద్ధి అవసరం. పూర్వపుణ్యం రక్షిస్తోంది. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. కొందరి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది.
ఇష్టదైవారాధన శుభప్రదం

 వృషభం

ఈరోజు
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్నది సొంతమవుతుంది. అనవసరంగా ఆందోళన తగ్గించుకుంటే మంచిది.
శివపంచాక్షరీ స్తోత్రము పఠిస్తే మంచిది

 మిధునం

ఈరోజు
ముందస్తు ప్రణాళికలతో మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. వ్యాపారంలో అనూహ్య లాభాన్ని పొందుతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.
లక్ష్మీదేవిని ఆరాధిస్తే బాగుంటుంది

 కర్కాటకం

ఈరోజు
మిత్రుల సహకారం ఉంటుంది. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే మొదలుపెట్టండి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం

 సింహం

ఈరోజు
అనుకూలమైన సమయం. మిత్రులు, బంధువులు మీ మాటకు విలువిస్తారు. మీరు ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు.
లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది

 కన్య

ఈరోజు
చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఒత్తిడి పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది. కనకధారాస్తవం పఠించాలి

 తుల

ఈరోజు
శుభకాలం. ఏ పని తలపెట్టిన త్వరగా పూర్తవుతుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలుంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం.
వేంకటేశ్వర సందర్శనం శుభప్రదం

 వృశ్చికం

ఈరోజు
ఉత్సాహంగా పనిచేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యం సహకరిస్తుంది.
రామ నామాన్ని స్మరించండి

 ధనుస్సు

ఈరోజు
చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంది. దైవబలం రక్షిస్తోంది.
ఇష్టదైవ సందర్శనం శుభప్రదం

 మకరం

ఈరోజు
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒత్తిడిని తట్టుకోలేక అధికారుల దగ్గర ఇబ్బందులుపడతారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో పొరపొచ్చలు వచ్చే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది

 కుంభం

ఈరోజు
వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
దుర్గాస్తుతి పఠిస్తే మంచిది

 మీనం

ఈరోజు
వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుకూలమైన ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

Panchangam

పంచాంగం
తేది : 3, జనవరి 2022
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి
(నిన్న రాత్రి 12 గం॥ 35 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 28 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాషాడ
(నిన్న సాయంత్రం 4 గం॥ 52 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 3 గం॥ 25 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు రాత్రి 10 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు రాత్రి 12 గం॥ 27 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 16 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 28 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 34 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 33 ని॥ లకు

check Daily Horoscope 20/12/2021

Leave a Reply

%d bloggers like this: