Daily Horoscope 30/10/2021

0
151
Daily Horoscope 20/05/2022
Daily Horoscope 20/05/2022

Daily Horoscope 30/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

30, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
కృష్ణ ఏకాదశి
బృహస్పతి వాసరే (గురువారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి . కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకోవాలి. పెద్దల సహకారంతో పనులను పూర్తి చేస్తారు.
సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఉత్తమం

 వృషభం

ఈరోజు
మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్నది సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. దైవ బలం కాపాడుతోంది.
విష్ణు ఆరాధన చేస్తే మంచిది

 మిధునం

ఈరోజు
అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం

 కర్కాటకం

ఈరోజు
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగించుకోడానికి వేంకటేశ్వరుని పూజించాలి

 సింహం

ఈరోజు
ధనధాన్యాది లాభాలు ఉన్నాయి. మనోధైర్యం విశేషంగా ఉంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది.
సూర్యాష్టకం చదవడం మంచిది

 కన్య

ఈరోజు
ప్రయత్నాలు సిద్ధిస్తాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది.
ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు

 తుల

ఈరోజు
అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి.
ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం

 వృశ్చికం

ఈరోజు
గ్రహ సంపత్తి అనుకూలంగా ఉంది. అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. అభివృద్ధిపథంలో ముందుకు సాగుతారు.
శివాష్టోత్తరం చదవాలి

 ధనుస్సు

ఈరోజు
కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.
హనుమాన్ చాలీసా చదవాలి

 మకరం

ఈరోజు
మీ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శ్రీరామనామాన్ని జపించాలి

 కుంభం

ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి.
ఈశ్వరారాధన మంచిది

 మీనం

ఈరోజు
అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. సౌభాగ్యసిద్ధి ఉంది.
ఇష్టదేవతను ఆరాధించాలి

Panchangam

శ్రీ గురుభ్యోనమః
గురువారం, డిసెంబర్ 30, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి: ఏకాదశి ఉ9.44 వరకు తదుపరి ద్వాదశి
వారం:గురువారం(బృహస్పతి వాసరే)
నక్షత్రం:విశాఖ రా9.46 తదుపరి అనూరాధ
యోగం:ధృతి రా7.36 తదుపరి శూలం
కరణం:బాలువ ఉ9.44 తదుపరి కౌలువ రా8.39
వర్జ్యం:రా1.30 – 3.00
దుర్ముహూర్తం:ఉ10.13 – 10.57 & మ2.36 – 3.20
అమృతకాలం:మ1.28 – 2.58
రాహుకాలo: మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.31
సూర్యాస్తమయం:5.28
మతత్రయ ఏకాదశి

check Daily Horoscope 17/12/2021

Leave a Reply