
Daily Horoscope 29/12/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
29, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
కృష్ణ దశమి
సౌమ్య వాసరే (బుధవారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹
రాశి ఫలాలు
మేషం
ఈరోజు
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.
గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది
వృషభం
ఈరోజు
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం
మిధునం
ఈరోజు
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు.
ఇష్టదేవతా స్మరణ శుభాన్ని చేకూరుస్తుంది
కర్కాటకం
ఈరోజు
శుభ సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు
సింహం
ఈరోజు
ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి.
హనుమాన్ చాలీసా చదివితే మంచిది
కన్య
ఈరోజు
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. పెద్దలను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవి ఆరాధన వల్ల అంతా మంచి జరుగుతుంది
తుల
ఈరోజు
శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహాలు సూచితం. తోటివారిని కలుపుకొనిపోవడం ఉత్తమం.
గణేశ అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి
⚖⚖⚖⚖⚖⚖⚖
వృశ్చికం
ఈరోజు
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. కానీ, వాళ్లు మిమ్మల్ని నమ్మంచి మోసం చేసే అవకాశం ఉంది. అనవసర అంశాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించకండి. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి.
లక్ష్మీ అష్టోత్తరం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది
ధనుస్సు
ఈరోజు
ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కీలక బాధ్యతలు భుజాన పడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.
లలితా సహస్రనామ పారాయణ ఉత్తమం
మకరం
ఈరోజు
కార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం కలదు. బుద్ధిబలంతో తోటివారి మనస్సును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం
కుంభం
ఈరోజు
ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది
మీనం
ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ఇంట్లోని వారితో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది
Panchangam
ఓం శ్రీ గురుభ్యోనమః
డిసెంబర్ 29, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంతఋతువు
మార్గశిర మాసం
కృష్ణ పక్షం
తిధి: దశమి ఉ11.40
తదుపరి ఏకాదశి
వారం: బుధవారం
(సౌమ్యవాసరే)
నక్షత్రం: స్వాతి రా11.09
తదుపరి విశాఖ
యోగం: సుకర్మ రా10.29
తదుపరి ధృతి
కరణం: భద్ర ఉ11.40
తదుపరి బవ రా10.42 వరకు
వర్జ్యం: ఉ.శే.వ7.07 వరకు
&
తె4.25 – 5.55
దుర్ముహూర్తం: ఉ11.40 – 12.24
అమృతకాలం: మ2.45 – 4.17
రాహుకాలం: మ12.00 – 1.30
యమగండం: ఉ7.30 – 9.00
సూర్యరాశి: ధనుస్సు
చంద్రరాశి: తుల
సూర్యోదయం: 6.31
సూర్యాస్తమయం: 5.28