Daily horoscope 28/12/2021

0
52
Daily Horoscope 18/01/2022
Daily Horoscope 18/01/2022

Daily horoscope 28/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

28, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
కృష్ణ నవమి
భౌమ్య వాసరే (మంగళవారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆపదలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవతా స్తుతి శుభప్రదం

 వృషభం

ఈరోజు
ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది.
గణేశ అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి

 మిధునం

ఈరోజు
ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
ఈశ్వర దర్శనం శుభప్రదం

 కర్కాటకం

ఈరోజు
అదృష్టం వరిస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఇష్టదేవతారాధన సత్పలితాలను ఇస్తుంది

 సింహం

ఈరోజు
మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు గుర్తింపు దక్కుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం

 కన్య

ఈరోజు
ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించినదాని కన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.
లక్ష్మీదేవి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది

 తుల

ఈరోజు
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడిని పెంచే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.
నవగ్రహ ధ్యాన శ్లోకం చదవాలి

 వృశ్చికం

ఈరోజు
మంచి ఫలితాలు ఉన్నాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది.
లక్ష్మీగణపతి ధ్యానం శుభప్రదం

 ధనుస్సు

ఈరోజు
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.
ఇష్టదైవారాధన మేలు చేస్తుంది

 మకరం

ఈరోజు
మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది

 కుంభం

ఈరోజు
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. హనుమాన్ చాలీసా జపించడం మంచిది

 మీనం

ఈరోజు
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర ధాన్య లాభాలు ఉన్నాయి. ఎవరినీ అతిగా నమ్మకండి.
సూర్యస్తుతి శుభప్రదం

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
డిసెంబర్ 28, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంతఋతువు
మార్గశిర మాసం
కృష్ణ పక్షం
తిధి: నవమి మ1.18
తదుపరి దశమి
వారం: మంగళవారం
(భౌమ్యవాసరే)
నక్షత్రం: చిత్త రా12.16
తదుపరి స్వాతి
యోగం: అతిగండ
రా1.10 వరకు
కరణం: గరజి మ1.18
తదుపరి వణిజ రా10.28 వరకు
వర్జ్యం: ఉ8.49 – 10.22
&
తె5.36నుండి
దుర్ముహూర్తం: ఉ8.44 – 9.28
&
రా10.43 – 11.35
అమృతకాలం: లేదు
రాహుకాలం: మ3.00 – 4.30
యమగండం: ఉ9.00 – 10.30
సూర్యరాశి: ధనుస్సు
చంద్రరాశి: కన్య
సూర్యోదయం: 6.31
సూర్యాస్తమయం: 5.28

check Daily Horoscope 15/08/2021

Leave a Reply