Daily Horoscope 25/12/2021

0
60
Daily Horoscope 25/01/2022
Daily Horoscope 25/01/2022

Daily Horoscope 25/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

25, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 25/12/2021
Daily Horoscope 25/12/2021

రాశి ఫలాలు

మేషం

చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు.

వృషభం

సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మిధునం

దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసల తో కాని పనులు పూర్తి కావు. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం

చేపట్టిన పనులలో శ్రమ అంతగా ఫలించదు. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో వివాదాలు తప్పవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

సింహం

దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

కన్య

కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవదర్శనాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

తుల

ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు . ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

వృశ్చికం

దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు

ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. దైవచింతన పెరుగుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మకరం

ముఖ్యమైన వ్యవహారాలు వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి.

కుంభం

విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి.

మీనం

సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది స్థిరస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శనివారం, డిసెంబర్ 25, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి:షష్ఠి మ3.55 వరకు తదుపరి సప్తమి
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:పుబ్బ రా1.34 వరకు
యోగం:ప్రీతి ఉ9.06 వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం:వణిజ మ3.55తదుపరి విష్ఠి తె3.41 వరకు
వర్జ్యం: మ9.16 – 10.53
దుర్ముహూర్తం :ఉ6.31 – 7.58
అమృతకాలం: రా7.02 – 8.40
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:సింహం
సూర్యోదయం: 6.31
సూర్యాస్తమయం:5.28

check Daily Horoscope 02/12/2021 :

Leave a Reply