Daily Horoscope 24/12/2021

0
Daily Horoscope 24/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

24, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
కృష్ణ పంచమి
బృగు వాసరే (శుక్రవారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 24/12/2021
Daily Horoscope 24/12/2021

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మానసిక పీడ పెరుగుతుంది.
పంచముఖ ఆంజనేయుని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి

 వృషభం

ఈరోజు
ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోవద్దు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది.
దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది

మిధునం

ఈరోజు
సౌభాగ్య సిద్ధి ఉంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. లాభంలో చంద్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.
ఇష్టదేవతా స్తుతి మంచిది

 కర్కాటకం

ఈరోజు
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి.
శివనామాన్ని జపించాలి

 సింహం

ఈరోజు
విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఇష్టదైవ నామస్మరణ మంచిది

 కన్య

ఈరోజు
ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి.
మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి

 తుల

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.
ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది

 వృశ్చికం

ఈరోజు
ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి.
లక్ష్మీ ధ్యానం శుభప్రదం

 ధనుస్సు

ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందూ,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాదన మానవద్దు.
శివారాధన శుభప్రదం

 మకరం

ఈరోజు
ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం.
శివనామస్మరణ ఉత్తమం

 కుంభం

ఈరోజు
శరీర సౌఖ్యం ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.
ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది

 మీనం

ఈరోజు
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధన వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, డిసెంబర్ 24, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి:పంచమి మ3.50 వరకు
తదుపరి షష్ఠి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:మఖ రా1.07 వరకు
యోగం:విష్కంభం ఉ10.09 వరకు తదుపరి ప్రీతి
కరణం:తైతుల మ3.50 తదుపరి గరజి తె3.52 వరకు
వర్జ్యం:మ12.39 – 2.18
దుర్ముహూర్తం:ఉ8.42 – 9.26 &
మ12.21 – 1.05
అమృతకాలం:రా10.37 – 12.17
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:6.31
సూర్యాస్తమయం:5.28

check Daily Horoscope 21/12/2021

Leave a Reply

%d bloggers like this: