Home PANCHANGAM Daily Horoscope 21/12/2021

Daily Horoscope 21/12/2021

0
Daily Horoscope 21/12/2021

Daily Horoscope 21/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

21, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
కృష్ణ విదియ
భౌమ్య వాసరే (మంగళవారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 21/12/2021
Daily Horoscope 21/12/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి.
నవగ్రహ ధ్యానం శుభప్రదం

 వృషభం

ఈరోజు
మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మానసిక పీడ ఉంటుంది. దుర్గాదేవి ఆరాధనతో మనోబలం చేకూరుతుంది

 మిధునం

ఈరోజు
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయకండి.
ఇష్టదేవతారాధన శుభకరం

 కర్కాటకం

ఈరోజు
మంచి కాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది.
ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం

 సింహం

ఈరోజు
శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.
దేవతార్చన మంచిది

 కన్య

ఈరోజు
శుభకాలం. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. శ్రీవేంకటేశ్వరుని ఆరాధనతో శుభ ఫలితాలు కలుగుతాయి

 తుల

ఈరోజు
పనిలో శ్రమ పెరిగినప్పటికీ మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది.
,దుర్గాధ్యానం శుభప్రదం_

 వృశ్చికం

ఈరోజు
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు పడుతుంది.
లింగాష్టకం చదవాలి

 ధనుస్సు

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తవ్వవు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళితే మంచి జరుగుతుంది. ఆంజనేయ సందర్శనం శుభప్రదం

 మకరం

ఈరోజు
మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వార్తలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం చదవాలి

 కుంభం

ఈరోజు
స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది.
ఆంజనేయ ఆరాధన శుభప్రదం

 మీనం

ఈరోజు
మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయస్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌞 డిసెంబర్ 21, 2021 🌝
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంతఋతువు
మార్గశిర మాసం
కృష్ణ పక్షం
తిధి: విదియ
మ12.49 వరకు
తదుపరి తదియ
వారం: మంగళవారం
(భౌమ్యవాసరే)
నక్షత్రం: పునర్వసు
రా8.53 వరకు
తదుపరి పుష్యమి
యోగం: బ్రహ్మం ఉ11.01
వరకు తదుపరి ఐంద్రం
కరణం: గరజి మ12.40
తదుపరి వణిజ రా1.25
వర్జ్యం: ఉ7.46 – 9.30
&
తె.వ5.29నుండి
దుర్ముహూర్తం: ఉ8.40 – 9.24
&
రా10.39 – 11.31
అమృతకాలం: సా6.15 – 8.00
రాహుకాలం: మ3 00 – 4.30
యమగండం: ఉ9.00 – 10.30
సూర్యరాశి: ధనుస్సు
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం: 6.29
సూర్యాస్తమయం: 5.26

check Daily Horoscope 18/12/2021 :(Opens in a new browser tab)

Leave a Reply

%d bloggers like this: