Daily Horoscope 19/12/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
19, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి సాయం చేసే వారున్నారు. యశోవృద్ధి కలదు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నవదుర్గా స్తోత్రం పఠించాలి.
వృషభం
ఈరోజు మిశ్రమకాలం. ఒత్తిడి పెరగకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో మీరు ఆశించిన సాయం అందుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడవలసి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంకా బాగుంటుంది.
మిధునం
ఈరోజు ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
కర్కాటకం
ఈరోజు చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. జన్మరాశిలో చంద్ర బలం యోగిస్తోంది. గణపతి ఆరాధన శుభప్రదం.
సింహం
ఈరోజు మొదలుపెట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కనకధారాస్తవము పారాయణ చేయడం మంచిది.
కన్య
ఈరోజు శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచిది.
తుల
ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ధన వ్యయం జరిగే సూచనలున్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
వృశ్చికం
ఈరోజు కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకుని పోవడం మంచిది. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. గణపతి ఆరాధనా శుభప్రదం.
ధనుస్సు
ఈరోజు చేపట్టేపనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రమేయం లేని వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.
మకరం
ఈరోజు మంచి ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.
కుంభం
ఈరోజు మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు కాస్త ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. గోసేవ చేయడం మంచిది.
మీనం
ఈరోజు మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమిస్తారు. లక్ష్మీ దేవి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.
Panchangam
శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, డిసెంబర్19, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:పౌర్ణమి ఉ8.40 వరకు తదుపరి బహుళ పాడ్యమి
వారం:ఆదివారం భానువాసరే)
నక్షత్రం:మృగశిర సా4.09 వరకు
తదుపరి ఆర్ధ్ర
యోగం:శుభం ఉ10.15 వరకు తదుపరి శుక్లం
కరణం:బవ ఉ8తదుపరి బాలువ రా9.43
వర్జ్యం:రా1.25 – 3.11
దుర్ముహూర్తo:మ3.58 – 4.42
అమృతకాలం:ఉ8.10వరకు
రాహుకాలం:మ4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:6.27
సూర్యాస్తమయం:5.26
check Daily Horoscope 10/11/2021 :