
Daily Horoscope 17/12/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
17, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
శుక్ల చతుర్ధశి
బృగు వాసరే (శుక్రవారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. శివారాధన శుభప్రదం
వృషభం
ఈరోజు వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. పెద్దల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. సూర్య స్తోత్రం చదివితే మంచిది
మిధునం
ఈరోజు కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. శని ధ్యానశ్లోకం చదువుకోవాలి
కర్కాటకం
ఈరోజు కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దైవ దర్శనం శుభప్రదం
సింహం
ఈరోజు ఒక శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల ప్రశంసలు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు
కన్య
ఈరోజు ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం
తుల
ఈరోజు మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం చదివితే మంచిది.
వృశ్చికం
ఈరోజు శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది . ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.
కనకధారాస్తోత్రం చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు
ఈరోజు మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ఘటనలు చోటుచేసుకుంటాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
మకరం
ఈరోజు కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. విందూ వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శనిశ్లోకం చదవండి
కుంభం
ఈరోజు మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. మంచి మనస్సుతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీలక్ష్మీ నారాయణ దర్శనం శుభప్రదం
మీనం
ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.
Panchangam
శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, డిసెంబర్17, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:చతుర్థశి ఉ6.27 వరకు
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:కృత్తిక ఉ11.01 వరకు తదుపరి రోహిణి
యోగం:సిద్ధం ఉ9.15 వరకు
తదుపరి సాధ్యం
కరణం:గరజి సా5.28 తదుపరి వణిజ
వర్జ్యం:తె4.41 – 6.27
దుర్ముహూర్తం:ఉ8.38 – 9.22 &
మ12.17 – 1.01
అమృతకాలం:ఉ6.23 – 10.08
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:6.27
సూర్యాస్తమయం:5.25