Home PANCHANGAM Daily Horoscope 16/12/2021 :

Daily Horoscope 16/12/2021 :

0
Daily Horoscope 16/12/2021 :

Daily Horoscope 16/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

16, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
శుక్ల త్రయోదశి
బృహస్పతి వాసరే (గురు వారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 16/12/2021
Daily Horoscope 16/12/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీ వేంకటేశ్వర దర్శనం శుభప్రదం

 వృషభం

ఈరోజు ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది

 మిధునం

ఈరోజు శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు.
సాయిబాబా వారి సచ్ఛరిత్ర పారాయణ శుభాన్ని చేకూరుస్తుంది

 కర్కాటకం

ఈరోజు లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం

 సింహం

ఈరోజు ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు

 కన్య

ఈరోజు మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది

 తుల

ఈరోజు ధర్మసిద్ధి ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
గురుశ్లోకం చదవాలి.

 వృశ్చికం

ఈరోజు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం చదవాలి

ధనుస్సు

ఈరోజు శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. తోటివారి సహకారం ఉంటుంది. సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం.

 మకరం

ఈరోజు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. వృథా ప్రసంగాలతో సమయాన్ని వృథా చేయకండి. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది

 కుంభం

ఈరోజు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. గొప్పవారిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆదిత్య హృదయం చదవాలి

 మీనం

ఈరోజు అవరోధాలు ఉన్నాఆత్మబలంతో పోరాడి విజయం సాధిస్తారు. ధనధాన్యాభివృద్ధి ఉంది. మాట పట్టింపులకు పోకండి. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మకండి. విష్ణుసహస్రనామ స్తోత్రం చదివితే మంచిది.

Panchangam

శ్రీ గురుభ్యోనమః
గురువారం, డిసెంబర్16, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:త్రయోదశి తె4.27 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:భరణి ఉ8.41 వరకు తదుపరి కృత్తిక
యోగం:శివం ఉ8.58 వరకు తదుపరి సిద్ధం
కరణం:కౌలువ మ3.35 తదుపరి తైతుల తె4.27 వరకు
వర్జ్యం:రా9.50 – 11.35
దుర్ముహూర్తం:ఉ10.05 – 10.49 & మ2.28 – 3.12
అమృతకాలం: లేదు
రాహుకాలం: ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:6.26
సూర్యాస్తమయం:5.24
ధనుస్సంక్రమణం, ధనుర్మాసారంభం,
ధనుర్మాసపూజ మ12.26

check Home Remedies For Irregular Periods :

Leave a Reply

%d bloggers like this: