Daily Horoscope 14/12/2021 :

0
174

Daily Horoscope 14/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

14, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
శుక్ల ఏకాదశి
భౌమ్య వాసరే (మంగళ వారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 14/12/2021
Daily Horoscope 14/12/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి

వృషభం

ఈరోజు మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు

 మిధునం

ఈరోజు ముఖ్య వ్యవహారాలలో గొప్ప లాభాలు పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.
ఇష్టదేవతా దర్శనం శుభప్రదం

 కర్కాటకం

ఈరోజు శుభకాలం. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం

సింహం

ఈరోజు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది

కన్య

ఈరోజు మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు

 తుల

ఈరోజు అవసరానికి తగిన సాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సాయం మేలు చేస్తుంది. గోవిందనామాలు చదవటం మంచిది

 వృశ్చికం

ఈరోజు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటి వారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దైవారాధన మానవద్దు

 ధనుస్సు

ఈరోజు శారీరక శ్రమ పెరగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి.
దైవారాధన మానవద్దు

 మకరం

ఈరోజు తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. శివనామస్మరణ మేలు చేస్తుంది

 కుంభం

ఈరోజు మంచి ఫలితాలు ఉన్నాయి. విందు,వినోద, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు.
ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది

 మీనం

ఈరోజు ప్రారంభించబోయే పనుల్లో మీ శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శనిధ్యానం శుభప్రదం

Panchangam

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, డిసెంబర్ 14, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:ఏకాదశి రా1.20 వరకు
వారo:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:అశ్విని పూర్తి
యోగం:వరీయాన్ ఉ9.18 వరకు
తదుపరి పరిఘము
కరణం:వణిజ మ12.53 తదుపరి భద్ర రా1.20
వర్జ్యం:రా2.26 – 4.08
దుర్ముహూర్తం:ఉ8.36 – 9.20 &
రా10.36 – 11.28
అమృతకాలం:రా11.03 – 12.44
రాహుకాలం: మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:6.25
సూర్యాస్తమయం:5.24
సర్వ ఏకాదశి & గీతా జయంతి

check Daily Horoscope 29/09/2021

Leave a Reply