Daily Horoscope 11/12/2021 :

0
139

Daily Horoscope 11/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

12, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
శుక్ల నవమి
భాను వాసరే (ఆది వారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 12/12/2021
Daily Horoscope 11/12/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. అపార్థాలు రాకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది

 వృషభం

ఈరోజు
ఇష్ట కార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్య నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. దత్తాత్రేయుడిని ఆరాధిస్తే మంచిది

 మిధునం

ఈరోజు మొదలు పెట్టిన పనులను పూర్తిచేస్తారు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ మనసు చెప్పిన ప్రకారం నడుచుకుంటే శుభం చేకూరుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు

కర్కాటకం

ఈరోజు మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంది. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. తప్పుదోవ పట్టించేవారితో జాగ్రత్తగా ఉండాలి. చంచల బుద్ధితో సమస్యలు వస్తాయి. నిద్రాహారాల్లో జాగ్రత్త వహించాలి. ఆంజనేయ సోత్రం పారాయణ చేయాలి

 సింహం

ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమ ఫలిస్తుంది. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలుగుతాయి. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆదిత్య హృదయం చదువుకోవాలి

 కన్య

ఈరోజు విశేషమైన శుభ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో జయకేతనం ఎగురవేస్తారు. బుద్దిబలం బాగుంటుంది. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలసివస్తాయి. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం

 తుల

ఈరోజు
అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ఇష్ట దైవారాధన వల్ల మేలు జరుగుతుంది

 వృశ్చికం

ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో ముందుకు సాగితే మంచిది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శని ధ్యానం మంచినిస్తుంది

 ధనుస్సు

ఈరోజు మీ మీ రంగాల్లో ఆచి తూచి ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో జాప్యం వద్దు. ఒకటి ఊహిస్తే మరొకటి జరుగుతుంది. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. నవగ్రహ శ్లోకాలను చదవండి

 మకరం

ఈరోజు ధనలాభం కలదు. వ్యాపారంలో ఆర్థికవృద్ధిని సాధిస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. నూతనంగా పనులు చేపట్టేవారు సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొవాలి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచింది

కుంభం

ఈరోజు అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగించే విధంగా ఉంటాయి. వివాదాల్లో తలదూర్చకండి. మంచి మనసుతో ముందుకు సాగితే కష్టాలు తగ్గుతాయి. ఇష్ట దైవాన్ని సందర్శిస్తే మంచిది

 మీనం

ఈరోజు
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లక్ష్మీ ధ్యానం చేయాలి.

Panchangam

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, డిసెంబర్ 12, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి రా12.00 వరకు
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర తె4.11ని. వరకు
యోగం:సిద్ధి ఉ11.09 తదుపరి వ్యతీపాతం
కరణం:బాలువ మ12.04 తదుపరి కౌలువ రా12.00
వర్జ్యం:మ1.27 – 3.06
దుర్ముహూర్తం:సా3.55 – 4.39
అమృతకాలం:రా11.17 – 12.55
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం:6.24
సూర్యాస్తమయం:5.23

check Daily Horoscope 244/10/2021 

Leave a Reply