Daily Horoscope 10/12/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
10, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
శుక్ల సప్తమి
భృగు వాసరే (శుక్ర వారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.
గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది
వృషభం
ఈరోజు శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో తరచూ నిర్ణయాలు మార్చి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు
మిధునం
ఈరోజు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతాస్మరణ శుభాన్ని కలిగిస్తుంది
కర్కాటకం
ఈరోజు మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం
సింహం
ఈరోజు ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది
కన్య
ఈరోజు తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. పెద్దలను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవి ఆరాధన వల్ల బాగుంటుంది
తుల
ఈరోజు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు
వృశ్చికం
ఈరోజు
చంచల స్వభావం వల్ల ఆటంకాలు పెరుగుతాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. దుర్గారాధన వల్ల మంచి జరుగుతుంది
ధనుస్సు
ఈరోజు మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది.
గోసేవ చేయాలి
మకరం
ఈరోజు శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు
కుంభం
ఈరోజు ధర్మసిద్ది ఉంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్దితో ముందుకు సాగాలి. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది
మీనం
ఈరోజు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
Panchangam
శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, డిసెంబర్ 10, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి రా12.42 వరకు
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:శతభిషం తె3.34ని. వరకు
యోగం:హర్షణముమ2.33 తదుపరి వజ్రం
కరణం:గరజి మ1.14తదుపరి వణిజ రా12.42
వర్జ్యం:ఉ11.01 – 12.35
దుర్ముహూర్తం:ఉ8.34 – 9.18 & మ12.14 – 12.58
అమృతకాలం:రా8.28 – 10.03
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:6.22
సూర్యాస్తమయం:5.22
check Daily Horoscope 10/11/2021 :