Daily Horoscope 09/12/2021 :

0
121

Daily Horoscope 09/12/2021 

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

09, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
శుక్ల షష్టి
బృహస్పతి వాసరే (గురు వారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 09/12/2021
Daily Horoscope 09/12/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదిత్య హృదయం పఠించాలి

 వృషభం

ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధైర్యం, శరీరబలం, కీర్తి, భోజన సౌఖ్యం లభిస్తాయి. శ్రీవిష్ణు ఆరాధన చేయడం మంచిది

 మిధునం

ఈరోజు శుభ కాలం. కొన్ని వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. సకాలంలో సహాయం చేసేవారున్నారు. శివారాధన చేయడం మంచిది

 కర్కాటకం

ఈరోజు మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ శ్లోకాన్ని పఠించాలి

 సింహం

ఈరోజు మీమీ రంగాల్లో పెద్దల నుంచి మన్ననలను పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధనధాన్యవృద్ధి, సన్మానం, సుఖం, విద్యావంతులతో పరిచయాలు ఏర్పడుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది

 కన్య

ఈరోజు మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనుల్లో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవిందా నామాలు పఠిస్తే బాగుంటుంది

 తుల

ఈరోజు చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. అలసట పెరుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఇష్టదేవతా నామస్మరణ ఉత్తమం

 వృశ్చికం

ఈరోజు కీలక వ్యవహారాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది

 ధనుస్సు

ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు

 మకరం

ఈరోజు ఉత్తమ కాలం. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. బుద్ధిబలంతో కీలక వ్యవహారం నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. శని ధ్యాన శ్లోకం చదివితే శుభప్రదం

 కుంభం

ఈరోజు శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను, విషయాలను సాగదీయకండి. త్వరగా పూర్తయ్యేవిధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. ఆదిత్య హృదయం పఠించడం మంచిది

 మీనం

ఈరోజు ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సివస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం

Panchangam

శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం, డిసెంబర్ 9, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:షష్ఠి రా1.44ని.వరకు
వారం :గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:ధనిష్ఠ తె3.55ని. వరకు
యోగం:వ్యాఘాతం సా4.45 తదుపరి
కరణం:కౌలువ మ2.28 వరకు తదుపరి తైతుల రా1.44
వర్జ్యం:ఉ8.33 – 10.06
దుర్ముహూర్తం:ఉ10.02 – 10.46 &
మ2.26 – 3.10
అమృతకాలం:సా5.50 – 7.23
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:6.22
సూర్యాస్తమయం:5.22
శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

check Daily Horoscope 27/09/2021 :

Leave a Reply