Daily Horoscope 08/12/2021 :

0
112
Daily Horoscope 15/01/2022
Daily Horoscope 15/01/2022

Daily Horoscope 08/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

08, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
శుక్ల పంచమి
సౌమ్య వాసరే (బుధ వారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 08/12/2021
Daily Horoscope 08/12/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం

 వృషభం

ఈరోజు కీలక నిర్ణయాలను అమలు చేసేముందు బాగా అలోచించి ముందు సాగాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మీ గణపతి సందర్శనం శక్తినిస్తుంది

 మిధునం

ఈరోజు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాల్లో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పు పొందుతారు.
సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి

 కర్కాటకం

ఈరోజు మిశ్రమకాలం. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి

 సింహం

ఈరోజు మీమీ రంగాల్లో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరాభిషేకం శుభాన్నిస్తుంది

 కన్య

ఈరోజు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి.
శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి

 తుల

ఈరోజు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది

 వృశ్చికం

ఈరోజు
మంచి ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్నిస్తాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం

 ధనుస్సు

ఈరోజు బాగా ఆలోచించి పనులను చేయాలి. మిత్రులతోకలసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం మంచి ఫలితాలనిస్తుంది

 మకరం

ఈరోజు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. యుక్తితో ఎంతటి కార్యాన్నైనా అసంపూర్ణంగా వదలకుండా పూర్తిచేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వెంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది

 కుంభం

ఈరోజు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధుమిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి

 మీనం

ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. సౌభాగ్యసిద్ధి ఉంది. లక్ష్మి సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

Panchangam

శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, డిసెంబర్ 8, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి :పంచమి తె3.110ని.వరకు
వారo:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:శ్రవణం తె4.41ని. వరకు
యోగం:ధృవం రా7.16 తదుపరి వ్యాఘాతం
కరణంబవ సా4.04 వరకు తదుపరి బాలువ తె3.11
వర్జ్యం:ఉ9.35 – 11.06
దుర్ముహూర్తం:ఉ11.30 – 12.14
అమృతకాలం:సా6.45 – 8.16
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:6.22
సూర్యాస్తమయం:5.22

check Daily Horoscope 28/11/2021 

Leave a Reply