Home PANCHANGAM Daily Horoscope 07/12/2021 :

Daily Horoscope 07/12/2021 :

0
Daily Horoscope 07/12/2021 :

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

07, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
శుక్ల తదియ
భౌమ్య వాసరే (మంగళ వారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 07/12/2021
Daily Horoscope 07/12/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదురవుతాయి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. వివాదాల్లో తలదూర్చకండి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం శ్రేయోదాయకం

 వృషభం

ఈరోజు మిశ్రమ కాలం. పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది

 మిధునం

ఈరోజు ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతవరణం ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం

కర్కాటకం

ఈరోజు మధ్యమ ఫలితాలున్నాయి. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది

 సింహం

ఈరోజు శుభకాలం. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని సందర్శిస్తే మంచిది

 కన్య

ఈరోజు చేపట్టిన పనులను చక్కటి ప్రణాళికతో పూర్తిచేస్తారు. అవసరానికి సాయం చేసేవారున్నారు. శుభ సమయం. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచింది

 తుల

ఈరోజు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ఖర్చులు పెర పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి

 వృశ్చికం

ఈరోజు శ్రమ ఫలిస్తుంది. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. విష్ణు ఆరాధన శుభప్రదం

 ధనుస్సు

ఈరోజు అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా నామాన్ని జపించడం ఉత్తమం

 మకరం

ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గొప్ప ఆలోచనా విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి

 కుంభం

ఈరోజు ఒక శుభవార్త వింటారు. ఆర్థికంగా లాభాన్ని గడిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు పరిస్థితులు తారుమారు కాకుండా జాగ్రత్త పడడం మంచిది. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం

 మీనం

ఈరోజు గ్రహబలం చాలా తక్కువగా ఉంది. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

Panchangam

పంచాంగం
తేది : 7, డిసెంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిరమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(నిన్న ఉదయం 9 గం॥ 10 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 6 గం॥ 56 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాషాఢ
(నిన్న ఉదయం 8 గం॥ 35 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 4 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 8 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 21 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 21 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 21 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 21 ని॥ లకు

check Daily Horoscope 09/10/2021 :

Leave a Reply

%d bloggers like this: