Daily Horoscope 06/12/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
06, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
శుక్ల విదియ
ఇందు వాసరే (సోమ వారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శివారాధన మంచిది.
వృషభం
ఈరోజు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం మేలు చేస్తుంది
మిధునం
ఈరోజు శుభకాలం. మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య పనులను మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి
కర్కాటకం
ఈరోజు మీమీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడవలసి వస్తుంది. సహనం కోల్పోకూడదు. నిదానంగా అన్ని సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మి సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది
సింహం
ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మంచి ఫలితాలున్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. ఇష్టదేవత సందర్శనం ఉత్తమం
కన్య
ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం
తుల
ఈరోజు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది
వృశ్చికం
ఈరోజు మంచి ఫలితాలను అందుకుంటారు. మీ చిత్తశుద్దే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది.
ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది
ధనుస్సు
ఈరోజు గ్రహబలం అనుకూలంగా లేదు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది
మకరం
ఈరోజు గ్రహబలం విశేషంగా ఉంది. శుభసమయం. మీమీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం
కుంభం
ఈరోజు శుభకాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
మనోబలం పెరగటానికి లక్ష్మి ధ్యానం శుభప్రదం
మీనం
ఈరోజు తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు.
Panchangam
శ్రీ గురుభ్యోనమః
సోమవారం, డిసెంబర్ 6, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిధి:విదియ ఉ9.09 తదుపరి తదియ
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:మూల ఉ8.36 తదుపరి పూర్వాషాఢ
యోగం:గండం రా12.55 తదుపరి వృద్ధి
కరణం:కౌలువ ఉ9.09 వరకు తదుపరి తైతుల రా8.01ఆ తదుపరి గరజి
వర్జ్యం:ఉ7.04 – 8.36 సా5.34 – 7.04
దుర్ముహూర్తం:మ12.12 – 12.56 &
మ2.24 – 3.08
అమృతకాలం:రా2.32 – 4.02
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:6.20
సూర్యాస్తమయం:5.21
check Daily Horoscope 03/11/2021 :