
Daily Horoscope 02/12/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
09, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
02.12.2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
కార్తిక మాసం
బహుళ పక్షం
తిధి : త్రయోదశి
శరదృతువు
దక్షణాయనము

రాశిఫలాలు
మేషం
అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1,
స్నేహితులతో అకారణ వైరం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగులకు పనిభారం.తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు.రాజకీయవేత్తలకు పర్యటనలు రద్దు.వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు తప్పవు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
వృషభం
కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2,
బంధువులతో అకారణంగా తగాదాలు.మీ ప్రవర్తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇతరులతో అకారణ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదువ్యాపారులకు లాభాలు కనిపించవు.
ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి
.అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలకు పర్యటనల్లో ఆటంకాలు.
మిథునం
మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3,
ఆస్తి వివాదాల పరిష్కారం. శుభ వర్తమానాలు.నూతన వాహన యోగం ఉన్నది.ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. శారీరక రుగ్మతలు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
బంధువుల నుంచి ముఖ్య సమాచారం
కర్కాటకం
పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4,
శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు.ఇతరులకు ధన పరంగా మాటఇచ్చేవిషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు మార్పులు. కళాకారులకు చిక్కులు.చేపట్టిన పనులలో శ్రమపెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు కొంత బాధిస్తాయి చోరభయం.కష్టమే తప్ప ఫలితం ఉండదు.ఆరోగ్యం సహకరించక మానసిక సమస్యలు వేదిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు.
సింహం
మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1,
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు.ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు.అవసరానికి చేతిలో డబ్బు నిల్వఉండదు. వస్తు లాభాలు.నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి చికాకు పరుస్తుంది.
కన్య
ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2,
ఇంటర్వ్యూలు అందుతాయి.ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. దూరపు బంధువులను కలుసుకుంటారు
తుల
చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3,
రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీయానం.నూతన వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు
నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు హోదాలు సంతోషాన్నిస్తాయి.
వృశ్చికం
విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4, వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి.పనులు సకాలంలో పూర్తి చేస్తారుబంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి
ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు అందుతాయి. ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. అయినవారితోతగాదాలు.
ధనుస్సు
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం వ్యాపారులకు లాభాలు కష్టమే.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. గ్రామ వాలంటిగా ఉన్నవారికి అపవాదులు. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది.ఉద్యోగులకు పనిభారంఅనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతనవ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు.చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.ఆర్ధిక పురోగతి కలుగుతుంది. పాత రుణాలు తీర్చగలరు. అయినవారితో
తగాదాలు.నిరుద్యోగులకు ప్రయత్నాలు ముందుకు సాగవురాజకీయవేత్తలకు పదవులు ఊరిస్తాయి.
మకరం
ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2, వ్యాపారులు ఆచితూచి అడుగేయాలి.కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. ఖర్చులు పెరిగి అప్పులు చేయాల్సివస్తుంది.సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు అవకాశాలు తప్పిపోతాయి.దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు కొద్దిపాటి చికాకులు.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ శ్రమ ఇతరులకు ఉపయోగపడుతుంది.దూర ప్రయాణాలు.
కుంభం
ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3, వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.ఆప్తులు,నుంచి కీలక సమాచారం.నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.కుటుంబ విషయంలో ఆకస్మిక మార్పులుంటాయి.దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది.దూర ప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలను వలన విభేదాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి
.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
మీనం
పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4, వ్యాపారులకు ఒడిదుడుకులు.ఆర్థిక వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసివస్తాయి. పారిశ్రామికవేత్తలకు పర్యటనల్లో ఆటంకాలు.రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. బంధువర్గంతో తగాదాలు.స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు.
Panchangam
పంచాంగం
02.12.2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
కార్తిక మాసం
బహుళ పక్షం
తిధి : త్రయోదశి సా 06.15:
తదుపరి చతుర్థశి
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం: స్వాతి మ 02.54 తదుపరి
యోగం: శోభన సా 06.14
కరణం: గరజి ఉ 07.14 వరకు
తదుపరి వణిజ సా 06.15
ఆ తదుపరి భద్ర తె 05.10
వర్జ్యం: రా 08.09 – 09.40
దుర్ముహూర్తం : ఉ 09.58 – 10.42 & మ 02.28 – 03.12
అమృతకాలం: ఉ 06.33 – 08.04
రాహుకాలం : మ01.30 – 03.00
గుళికకాలం:ఉ: 09.00-10.30
యమగండ/కేతుకాలం:
ఉ 06.00 – 07.30
సూర్యరాశి: వృశ్చికం చంద్రరాశి: తుల
సూర్యోదయం: 06.16 సూర్యాస్తమయం: 05.20