Daily Horoscope 30/11/2021 :

0
65
Daily Horoscope 15/01/2022
Daily Horoscope 15/01/2022

Daily Horoscope 30/11/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

30, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము

రాశి ఫలాలు
30 నవంబర్ 2021
మంగళవారం NOVEMBER 30

Daily Horoscope 30/11/2021
Daily Horoscope 30/11/2021

మేషం

అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1, శారీరక∙రుగ్మతలు. మాటపట్టింపులు.ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి మీ పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. రుణం తీర్చటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. వ్యవహారాలు మందగిస్తాయి..రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు. కళాకారుల యత్నాలలో అవరోధాలు. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అజ్ఞాత వ్యక్తుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. విద్యార్థినుల్లో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు.ఆకస్మిక ప్రయాణాలు.

వృషభం

కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబంలో చికాకులు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళకువ అవసరం. ఖర్చులు అధికమవుతాయి. రాజకీయవర్గాలకు నిరాశ. శత్రువులు మిత్రులుగా మారతారు. కార్యదీక్షతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు. వాహనాలు కొనుగోలు చేస్తారు.
వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా పురోభివృద్ధి కానవస్తుంది.షేర్ల విక్రయాలలో తొందరపాటు వద్దు

 

మిథునం

మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3, వ్యవహారాలలో విజయం. కీలక నిర్ణయాలు సుకుంటారు.రాజకీయవేత్తలకు విదేశీయానం. దూర ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. స్త్రీలలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణాలు, మరమత్తులు చేపడతారు. ఆపద సమయంలో బంధుమిత్రులు అండగా నిలుస్తారు.
ఉద్యోగులకు ఉన్నత స్థితి. వివాదాల నుంచి బయటపడతారు.

కర్కాటకం

పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4, కాంట్రాక్టులు అంతగా కలసిరావు.బంధువులతో తగాదాలు.ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు వాయిదా పడతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు.ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం.కొన్ని శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు కుటుంబ సమస్యలు.గందరగోళంగా ఉంటుంది.

సింహం

మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. సంతాన విషయంలో సంజాయిషీలు ఇచ్చుకొనవలసి వస్తుంది. అవివాహితులకు కలిసివచ్చే కాలం. ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.పెద్దల ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన మంచిది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.రాజకీయవేత్తలకు ఊహలు నిజం కాగలవు.

కన్య

ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2, నిరుద్యోగులకు ఒత్తిడులు. శారీరక సంబంధిత రుగ్మతలు. విదేశీయానం యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికిబదిలీ, ప్రమోషన్ వంటి శుభ పరిణామాలున్నాయి.వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. మీ శ్రీమతి నుంచి అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగాలలో పనిభారం మీద పడుతుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. అయినవారి మధ్య అపోహలు తొలగి అనురాగ
వాత్సల్యాలు పెంపొందుతాయి. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.కుటుంబంలో చికాకులు.

తుల

చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3, ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలించవు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది.కొత్త విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది.రాజకీయవర్గాలకు మరింత సానుకూలం. వాహనాలు, స్థలాలు కొంటారు.

వృశ్చికం

విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4, ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆలోచనలు స్థిరంగా ఉండవు.మీ పై ఆధారపడిన వారి పట్ల విజ్ఞతాయుతంగా మెలగండి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఇంటా బయటా ఒత్తిడులు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు.అనారోగ్య సూచనలు. అయినవారిమధ్య సమస్యలు ఎదురుకావచ్చు. విదేశీ పర్యటనలలో ఆటంకాలు.

ధనుస్సు

మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం ఆకస్మిక ప్రయాణాలు. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది. చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసి రాగలదు. ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలు కుటుంబంలో ఒడిదుడుకులు.అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో సఫలీకృతులవుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఆర్థిక ఇబ్బందులు చికాకుపరుస్తాయి. బంధువులతో విరోధాలు నెలకొంటాయి. విద్యార్థులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది.ఉద్యోగులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. కొన్ని విషయాలలో విభేదిస్తారు.

మకరం

ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2, వ్యాపారాలలో ముందడుగు.వస్తు, వాహన లాభాలు.
కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల అదనపు పనిభారం తప్పదు. ప్రయాణాలలో మెళుకువ అవసరం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.కుటుంబంలో శుభకార్యాలు అనేవి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

కుంభం

ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3, ఆస్తి లేదా ధన లాభాలు.ఇంటా బయటా మీదే పైచేయిగా ఉంటుంది.వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కుటుంబంలో శుభకార్యాలు అనేవి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి.సన్నిహితుల నుంచి ధన లాభం.

మీనం

పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4, ఆరోగ్యపరంగా చికాకులు. ఉద్యోగులకు ఒత్తిడులు అధికమవుతాయి.మీ అభిప్రాయాలతో కుటుంబీకులు సానుకూలంగా స్పందిస్తారు.వ్యాపారాలలో చికాకులు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యం కాదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే
మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు సంతృప్తినిస్తాయి.ఆప్తులు నుంచి ఒత్తిడులు. దూరపు బంధువులను కలుసుకుంటారు.

Panchangam

పంచాంగం
తేది : 30, నవంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ఏకాదశి
(నిన్న రాత్రి 11 గం॥ 7 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 47 ని॥ వరకు)
నక్షత్రం : హస్త
(నిన్న సాయంత్రం 5 గం॥ 35 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 00 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు రాత్రి 12 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు రాత్రి 2 గం॥ 15 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 16 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 17 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 14 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 28 ని॥ లకు

check Daily Horoscope 10/11/2021 :

Leave a Reply