
Daily Horoscope 29/11/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
29, నవంబర్ , 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
కార్తిక మాసం
బహళ పక్షం
తిధి : దశమి రా 11.06 తదుపరి ఏకాదశి
వారం : సోమవారం (ఇందువాసరే)
రాశి ఫలాలు
29 నవంబర్ 2021
సోమవారం NOVEMBER 29

మేషం
అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1,
ఉద్యోగస్థులకు అధికారుల నుండి శుభ వార్తలు అందుతాయి.ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఆశాజనకంగా ఉంటుంది. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిహిత్యం కోరుకుంటారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల తీరు అసహనం కలిగిస్తుంది. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలుకాగలదు.ధన పరంగా ఇబ్బందులు తొలగుతాయి.
వృషభం
కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2,
భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి
నిరుత్సాహం వీడి మీ యత్నాలు కొనసాగించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి అమ్మకం యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి .నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి.
మిథునం
మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3, స్థిరస్తి విషయమై సోదరులతో వివాదాలు కలుగుతాయి.కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతరశ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలలో అనుకూలత, కొత్త అనుభూతికి లోనవుతారు. భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కర్కాటకం
పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4, ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తుల తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం.స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి నిరుద్యోగుల కృషికి తగిన ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి.దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది ఆదాయం అంతగా కనిపించదు.
సింహం
మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1, స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి.ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది.
కన్య
ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2, స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి.గృహ నిర్మాణం సంతృప్తికరంగా సాగుతుంది. ఒత్తిడి, శ్రమాధిక్యత వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కోర్టు వ్యవహరాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రత్యర్థులతో రాజీ కుదురుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ప్రముఖుల సహకారంతో మీ సమస్య పరిష్కారమవుతుంది.
తుల
చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3, ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యం కాదు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారుచేతివృత్తులు, కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహంలో సుఖశాంతులు సామాన్యంగా ఉంటాయి.
వృశ్చికం
విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4, గృహమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో రాణిస్తారు.స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం తప్పదు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు.
ధనుస్సు
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.స్త్రీలకు ఆధ్యాత్మిక చింతనతోపాటు ఇతర వ్యాపకాలులు అధికమవుతాయి. విదేశీయాన యత్నాలు సఫలీకృతులౌతారు. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు అందడంలో ఆలస్యం అవుతుంది.బంధు వర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సజావుగా సాగుతాయి. మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. భాగస్వామిక వ్యాపారాలు, స్పెక్యులేషన్ నిరాశపరుస్తాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మకరం
ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2, కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.శకునాల కారణంగా మీ ప్రయాణం వాయిదా వేసుకుంటారు.ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఊహించని అవశాలు వస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో రాణిస్తారు. విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగును. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది.కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.
కుంభం
ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3, వ్యాపారాలలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు. శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. నిరుద్యోగయత్నాలలో విజయం సాధిస్తారు.ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. లాయర్లకు, ఆడిటర్లకు సదావకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరు ఊరట చెందుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు .పరిచయాలు పెరుగుతాయి.
మీనం
పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4, ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నవి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రసంసలు పొందుతారు. వైద్య శిబిరంలోని వారు తరచూ ఒత్తిడులకు గురవుతారు.ఆకస్మిక ప్రయాణా సూచనలు ఉన్నవి.రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.
Panchangam
పంచాంగం 29.11.2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు
కార్తిక మాసం
బహళ పక్షం
తిధి : దశమి రా 11.06 తదుపరి ఏకాదశి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం: ఉత్తర సా 05.34 తదుపరి హస్త
యోగం: ప్రీతి రా 11.46 తదుపరి ఆయుష్మాన్
కరణం: వణిజ ఉ11.31
తదుపరి విష్ఠి రా 11.06 తదుపరి బవ
వర్జ్యం: రా 01.46 – 03.20
దుర్ముహూర్తం : మ 12.24 – 01.09 &
మ 02.39 – 03.24
అమృతకాలం: ఉ10.24 – 12.00
రాహుకాలం: ఉ 07.30- 09.00
గుళికకాలం: ప 01.30-03.00
యమగండ/కేతుకాలం మ 10.30 – 12.00
సూర్యరాశి: వృశ్చికం
చంద్రరాశి: కన్య
సూర్యోదయం: 06.16 సూర్యాస్తమయం: 05.20