Sri Karthika Puranam – Chapter 24 :

0
138
Sri Karthika Puranam Chapter 30
Sri Karthika Puranam Chapter 30

Sri Karthika Puranam – Chapter 24 – శ్రీ కార్తీక పురాణము – 24వ అధ్యాయము – అంబరీషుని ద్వాదశీవ్రతము – అత్రిమహాముని మరల అగస్త్యునితో ” ఓ కుంభసంభవా! కార్తీకవ్రత ప్రభావమునెంత విచారించిననూ, ఎంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపుము.

” గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులొనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకమాసవ్రతమందు శుద్ధద్వాదశీనాడు భక్తిశ్రద్ధలతో దానధర్మలు చేయు వారికిని అంత ఫలము కలుగును.

ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము ఇతర దినములలో చేసిన ఫలములకంటే వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము.

కార్తీక శుద్ధదశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశిరోజున ఏ వ్రతమును చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. Sri Karthika Puranam – Chapter 24

దీనికొక ఇతిహాసము కలదు.దానిని కూడా వివరించెదను శ్రద్దగా ఆలకింపుము. ” అని ఇట్లు చెప్పుచున్నాడు.

Karthika Purana - Chapter 24
Karthika Purana – Chapter 24

పూర్వము అంబరీషుడు అను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీవ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశినాడ్ తప్పకుండ వ్రతము చేయుచుండెను.

ఒక ద్వాదశినాడు, ద్వాదశి ఘడియలు స్వల్పముగా వుండెను. అందుచేత ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారధన చేయదలచి సిద్దముగా వుండెను.

అదే సమయమున అక్కడికి కోపస్వభావుడగు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలెయును గాన తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను.

దూర్వాసుడందులకు అంగీకరించి సమీపమునగల నదికి స్నానమునకై వెడలెను.

అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశిఘడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇలా అనుకొనెను.

” ఇంటికొచ్చిన దూర్వసుని భోజనమునకి రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనము పెట్టకపోవుట మహాపాపము.

అది గృహస్థధర్మం కాదు. ఆయన వచ్చువరకు ఆగితినా ద్వాదశిఘడియలు దాటిపోవును, వ్రతభంగ మగును. ఆ ముని మహాకోపస్వభావము గలవాడు.

ఆయన రాకుండగ నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజనం అతీక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు.

ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన యెడల హరిభక్తిని వదిలిన వాడిని అగుదును. ఏకాదశినాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడచి భుజించిన భగవంతునికి, భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును.

అదియుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయాశ్చితము లేదు”. అని ఆలోచించి ” బ్రాహ్మణ శాపమునకు భయములేదు ఆ భయమును శ్రీమహావిష్ణువే బోగొట్టగలడు.

కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయటమే ఉత్తమము అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచిది” అని సర్వజ్ణులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. Sri Karthika Puranam – Chapter 24

” ఓ పండిత శ్రేష్ఠులారా! నిన్నటిదినము ఏకాదశి యగుటం జేసి నేను కటిక ఉపవాసము వుంటిని. . ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలున్నవి.

అని జరిగిన వృత్తంతాని అంత వివరించి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా? లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చేవరకు వేచియుండవలెనా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినది” అను కోరెను.

అంతట ఆ ధర్మజ్ణులైన పండితులు, ధర్మశాస్త్రములు పరిశోధించి వారు విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని, దీర్ఘముగా ఆలోచించి ” మహారాజా!

సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తినొసంగుచున్నాడు.

ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ -దప్పిక కలుగును. ఆ తాపమును చల్లర్చవలెనన్న అన్నము, నీరు పుచ్చుకొని శాంతపరచవలెను.

శరీరమునకు శక్తికలుగజేయువాడు అగ్నిదేవుడు, దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుని అందరు సదా పూజించవలయును. గృహస్థు ఇంటికి వచ్చిన అతిధి కడజాతివాడైననూ ‘భోజన మిడుదును’ అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు.

అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును, మహాతపశ్శాలియు, సదాచర సంపన్నుడును అయిన దూర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును.

అందువలన ఆయుఃక్షీణము కలుగును. దూర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగును” అని విశదపరచిరి.

24వ అధ్యాయము సమాప్తము

Leave a Reply