Daily Horoscope 26/11/2021 :

0
160

Daily Horoscope 26/11/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

26, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము
సప్తమి
శరదృతువు
దక్షణాయనము
శుక్రవారం

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

ఈ రోజుటి రాశిఫలాలు
26 నవంబర్ 2021
శుక్రవారం NOVEMBER 26

Daily Horoscope 26/11/2021
Daily Horoscope 26/11/2021

మేషం

అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1,
ఆస్తి వివాదాలు తీరతాయి.ఇంట బయటా సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు.దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.ఉన్నత స్థాయి వ్యక్తుల సహాయ, సహకారాలు లభిస్తాయి. కళత్ర సౌఖ్యం ఉండును.ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు
.గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభ వర్తమానాలు. ఐరన్, సిమెంట్, కలప, రంగాలలో వారికి చురుకుదనం కానవస్తుంది.

వృషభం

కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2,
కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.స్త్రీలకు పరిచయాలు అధికం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ఇబ్బందులెదురవుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
పనులు అనుకున్న విధంగా పూర్తి చేయలేరు.

మిథునం

మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3,
ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.కృషి ఫలించదు. కొత్తగా అప్పులు చేస్తారు. బంధువర్గంతో తగాదాలు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఆందోళన.స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం

పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4,
సోదరులతో కలహాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు.ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు. దూర ప్రయాణాలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.మీ శ్రీమతి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఖర్చులు బాగా పెరిగే ఆస్కారం ఉంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. స్త్రీలు ఆహార, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో చికాకులు తప్పవు.
అవసరాలకు డబ్బు అందక ఇబ్బంది.

సింహం

మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1,
బందువర్గంతో తగాదాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా అనిపిస్తుంది. ఉన్నతస్థాయి అధికారులకు కిందిస్తాయి సిబ్బందితో చికాకులు తప్పవు.ప్రయత్నాలలో ఆటంకాలు. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఖర్చులు ఊహించినవే కావటంతో పెద్దగా ఇబ్బందులుండవు. ఒక అవకాశం కలిసిరావటంతో మీలో ఉత్సాహం నెలకొంటుంది
కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.

కన్య

ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2,
ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు. లారీ వ్యాపారులకు చికాకులు తప్పవు. దాన ధర్మాలు చేసిమంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఖర్చులు తప్పవు. మిత్రుల కలయిక మీకు సంతృప్తినిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నివాస గృహంలో సమస్యలు తలెత్తుతాయి.

తుల

చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3,
వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది
ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. జీవితాశయం నెరవేరుతుంది.రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.ఆసక్తికరమైన సమాచారం.

వృశ్చికం

విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4,
స్థిరాస్తి వృద్ధి.మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యార్థునులకు వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు. స్పెక్యులేషన్ సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు.ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.

ధనుస్సు

మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆరోగ్య సమస్యలు. కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు.స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి.ఉభయల మధ్య చిన్న చిన్న అభిప్రాయ
భేదాలు తలెత్తుతాయి.కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు.ఆలోచనలు నిలకడగా ఉండవుమీ బంధవులను సహాయం అర్లించే బడులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. గృహ నిర్మాణాలకు కావలసిన ప్లానుకు అమోదం లభిస్తుంది.

మకరం

ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2,
ఒక సమస్య నుంచి బయటపడతారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. భవిష్యత్ పై కొత్త ఆశలు. పరిచయాలు పెరుగుతాయిస్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ఆదాయం పెరుగుతుంది.వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు చేపడతారు
గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి.

కుంభం

ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3,
పనులు చకచకా సాగినట్టిసాగి హటాత్తుగా ఆగిపోవును మళ్ళి పక్షంరోజులుదాకా ఇబ్బందిగా ఉండును.
మీ శక్తిసామర్థ్యాలపై మీకు నమ్మకం ఏర్పడుతుంది. ఉపాధ్యాయులకు అనుకూలమైనకాలం. ఇచ్చిపుచ్చుకునే విషయాలు, పెట్టిపోతలలో పెద్దల సలహా పాటించండి.
కొత్త విషయాలు తెలుసుకుంటారు.స్వయంకృషితోనే మీరు బాగా రాణిస్తారు. దూరప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా అధికారులను మెప్పించటం కష్టం.

మీనం

పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4,
అనుకోని ఖర్చులు. కుటుంబసమస్యలు. వ్యాపార రహస్యాలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. పాత వస్తువులు కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలించవు
వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్య సమస్యలు
బంధువులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. రాజీమార్గంతో ఆస్తి, స్థల వివాదాలు పరిష్కారం కాగలవు, వాహనం నడుపునప్పుడు మెళుకువ అవసరం. విద్యార్థినులకు పరిచయాలు పెరుగుతాయి.వ్యవహారాలలో ఆటంకాలు.

Panchangam

పంచాంగం
తేది : 26, నవంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : సప్తమి
(నిన్న రాత్రి 11 గం॥ 40 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 12 గం॥ 14 ని॥ వరకు)
నక్షత్రం : ఆశ్లేష
(నిన్న సాయంత్రం 3 గం॥ 14 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 32 ని॥ వరకు)
శేష వర్జ్యం : ఈరోజు ఉదయం 6 గం॥ 24 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 15 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 56 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 14 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 20 ని॥ లకు

check Daily Horoscope 09/10/2021 :

Leave a Reply