Sri Karthika Puranam – Chapter 21 :

0
196
Sri Karthika Puranam Chapter 30
Sri Karthika Puranam Chapter 30

Sri Karthika Puranam – Chapter 21 – శ్రీ కార్తీక పురాణము – 21వ అధ్యాయము – పురంజయుడు కార్తీక ప్రభావమును ఎరుంగుట – యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు, కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగెను.

ఆ యుద్ధములో రధికుడు రధికునితోను, అశ్వసైనికుడు అశ్వసైనికునితోను, గజసైనికుడు గజసైనికునితోను, పదాతలు పదాతలతోను, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోను ఖడ్గము, గద, బాణము, పరశువు మొదలగు ఆయుదాలు ధరించి,

ఒండోరులను డీకొంటూ హుంకరించుకొంటూ, సింహనాదములు చేసుకొంటూ, శంఖములను పూరించుకొంటూ, ఉభయ సైన్యములు విజయ కాంక్షులై పోరాడిరి.

ఆ రణభూమిలో ఎక్కడ చూసిననూ విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రంధనలు.

Sri Karthika Puranam Chapter 21
Sri Karthika Puranam Chapter 21

పర్వతాలవలె పడివున్న ఏనుగులు, గుర్రాల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవపూతలు పుష్పక విమానముపై వచ్చిరి.

అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయెను. అయినను మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్ల అతి సాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను.

దానితో పురంజయుడు రహస్యమార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు.

పురంజయుడు విచారముతో, సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి ” రాజా! మున్నొకసారి నీ వద్దకి వచ్చితిని. నీవు ధర్మన్ని తప్పినావు.

నీవు చేస్తున్న దురాచారలకు అంతులేదు. ఇకనైననూ సన్మర్గుడవై వుండు అని హెచ్చరించియిని. అప్పుడు నామాటలానలేదు.

నీవు భగవంతున్ని సేవింపక అధర్మ ప్రవర్తుడవై వునందుననే ఈ యుద్దములో ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితివి. ఇప్పటికైన నా మాటలు ఆలకింపుము.

జయాపజయాలు దైవాధీనములని తెలుసుకుని, నీవు చింతతో క్రుంగిపోవుటయేల? శత్రురాజులను యుద్ధములో జయించి, నీ రాజ్యమును నీవు తిరిగి పొందలని వుంటే, నా హితోపదేశము వినుము.

ఇది కార్తీకమాసం రేపు కృత్తికానక్షత్రముతో కూడిన పౌర్ణమి కావున స్నానజపది నిత్యకర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామస్మరణమును చేస్తూ నాట్యము చేయుము.

ఇట్లూచేసినచో నీకు పుత్ర సంతతి కలుగును. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువులను దునుమానుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును.

కనుక రేపు అట్లుచేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్టసహవాసము చేయుట చేతనేగదా నీకీ అపజయము కలిగినది? కావున లెమ్ము.

శ్రీహరిని మదిలో తలచి నేను తెలియ చేసినట్లు చేయమని హితోపదేశము చేసెను.

21వ అధ్యాయము సమాప్తము

check Vaishakha Puranam – Chapter 4 వైశాఖ పురాణం – 4 వ అధ్యాయము

Leave a Reply