Daily Horoscope 19/11/2021 :

0
81
Daily Horoscope 15/01/2022
Daily Horoscope 15/01/2022

Daily Horoscope 19/11/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

19, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము  – శుక్ల పక్షం

ఈ రోజుటి రాశిఫలాలు
19 నవంబర్ 2021
శుక్రవారం NOVEMBER 19

Daily Horoscope 19/11/2021
Daily Horoscope 19/11/2021

రాశిఫలాలు
మేషం

అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1, నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. స్త్రీలు శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఖర్చులు అధికం. మిత్రుల కలయికతో నూతన ఉత్సాహం లభిస్తుంది.ఉద్యోగమున స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. కోర్టు వ్యవహరాలు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. ఉపాధ్యాయులకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వ్యాపార పరంగా నూతన అవకాశాలు జార విడవకుండా చూసుకోవాలి. Daily Horoscope 19/11/2021

వృషభం

కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2, ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చక పోవచ్చు.దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు.వృత్తి ఉద్యోగమున సమస్యలను మనోధైర్యంతో అదిగమిస్తారు.నూతన దంపతులకు సంతాన ప్రాప్తి. బంధువుల కోసం ధనం ఖర్చు చేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది

మిథునం

మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3, చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత అవసరం. వ్యాపారాలలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు నష్టాల బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల ఏకాగ్రత అవసరం. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు ఊహించనవే కావటంతో పెద్దగా ఇబ్బందులుండవు.ఉద్యోగ విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు.

కర్కాటకం

పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4, ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం విరమించుకోవటం శ్రేయస్కరం. దూరప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయినూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులలో విజయం సాదిస్తారు.ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.వ్యాపార విషయమై చర్చలు చేస్తారు.

సింహం

మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1,
ఆర్థికవ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలకు పరిష్కార మార్గాలు చూస్తారు. వృతిపరంగా ఎదురైన సమస్యలను అధికమిస్తారు. ప్రేమికులకు సన్నిహితులు అండగా నిలుస్తారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. కీలక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ యోగం ఉన్నది.డాక్టర్లు శస్త్రచికిత్సలో విజయాన్ని సాధిస్తారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలకు ప్రతి విషయంలోను తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది.

కన్య

ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2,
వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తాయి.హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు.దీర్ఘకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు.బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.ఆత్మీయులు, బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. Daily Horoscope 19/11/2021

తుల

చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3, ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి సోదరులతో పాత విషయాల గురించి చర్చిస్తారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలలొ ఆశించిన లాభాలు పొందుతారు.మీ కష్టం ఫలించటంతో అనిర్వచనీయమైన ఆనందం పొందుతారు.ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం

విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4, మీ అవసరాలు, బలహీనతలను ఇతరులు స్వార్థానికి వాడుకుంటారు. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు, తగిన ప్రతిఫలం లభిస్తాయి. బ్యాంకు పనులు వాయిదా పడతాయి.నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి ప్రోద్వలంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం లభిస్తుంది.

ధనుస్సు

మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.సిమెంటు, ఐరన్, సిమెంట్, కలప రంగాలలో వారికి వారి రంగాలలో చురుకుదనం కానవస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఇతరులజోక్యం వలన వాయిదాపడతాయి. శత్రువులు మిత్రులుగా మారి మీకు సహాయాన్ని అందిస్తారు.స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు.

మకరం

ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2, బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. రిప్రజెంట్లకు నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల్లో చికాకులు, పనిభారం, అధికారుల నుంచి ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు.వృత్తి వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు అదిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కుంభం

ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3, పొగాకు, ప్రత్తి రంగాలలో వారికి కలిసి వచ్చేకాలం. దైవదీక్షలు స్వీకరిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.అయినవారి నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి ఒక శుభకార్యం నిశ్చయంకావటంతో కల్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు. ఉభయల/ప్రేమికుల/సోదరలకు మధ్య కలహాలు తలెత్తుతాయి.

మీనం

పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4, ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు. పనుల్లో శారీరక శ్రమ తప్పదు. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. విదేశీవస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు
లౌకికంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు.నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. Daily Horoscope 19/11/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, నవంబర్ 19, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షం
తిథి:పౌర్ణమి మ12.56వరకు
తదుపరి కార్తీక బహళ పాడ్యమి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:కృత్తిక తె3.43 వరకు
యోగం:పరిఘము తె4.00వరకు
కరణం:బవ మ12.56 తదుపరి బాలువ రా1.55 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం: మ2.32 – 4.17
దుర్ముహూర్తం: ఉ8.24 – 9.08 &
మ12.07 – 12.52
అమృతకాలం:రా1.04 – 2.50
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:6.10
సూర్యాస్తమయం:5.21

Leave a Reply