Home Bhakthi Sri Karthika Puranam – Chapter 14 :

Sri Karthika Puranam – Chapter 14 :

0
Sri Karthika Puranam – Chapter 14 :
Karthika Puranam- Chapter 26

Sri Karthika Puranam – Chapter 14 – శ్రీ కార్తీక పురాణము – 14వ అధ్యాయము – ఆబోతును అచ్చుపోసి వదులుట (వృషోత్సర్గము) – కార్తీకపౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యములవలన వెనుకటి జన్మలందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకొందురు.

వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశమందు ఎవ్వరు ఆబోతును అచ్చువేసి వదులుతారా అని ఎదురుచూస్తూంటారు.

ఎవడు ధనవంతుడై వుండి కూడా పుణ్యకార్యక్రమములు చేయక, దానధర్మలు చేయక చివరికి ఆబోతును అచ్చువేసి పెండ్లైనా చేయడొ అలాంటి వాడు రౌరవాది సకల నరకములు అనుభవించటమేకాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేస్తాడు.

కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తన శక్తికొద్ది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయంకాల సమయమున శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగరణ ముండి మరునాడు తమశక్తి కొద్ది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనంపెట్టినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవిస్తారు.

కార్తీకమాసంలో విసర్జింపవలసినవి

ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల యెంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధబోజనమును చేయరాదు. నీరుల్లిపాయ తినరాదు.

తిలదానము పట్టరాదు. శివర్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనము చేయరాదు. కార్తీకమాసము నెలరోజులు కూడా రాత్రులు భుజింపరాదు.

విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము వుడాలి. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను.

కార్తీక మాసంలో తైలముపుసుకొని స్నానము చేయరాదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసంలో వేడినీటితో స్నానము చేస్తే కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చేప్పివున్నడు.

ఒకవేళ అనారోగ్యముగా వుండి ఎలాగైన విడవకుండా కార్తీకమాస వ్రతము చేయలనుకునేవారు మాత్రమే వెడినీటి స్నానము చేయవచ్చును.

Sri Karthika Puranam - Chapter 14
Sri Karthika Puranam – Chapter 14

అలా చేసేవారు గంగ, గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

ఏ నది దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయలి. అటుల చేయని యెడల జన్మజన్మములు నరకకూపమున బడికృశింతురు.

ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతిదగ్గరగాని, చెరువులనందుగాని స్నానము చేయవచ్చు. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధుకావేరి జలేస్మిన్ సన్నిధింకురు

అని పఠిస్తు స్నానము చేయవలెను. కార్తీకమాస వ్రతమును చేయువారు పగలు పురాణపఠనము శ్రవణము, హరికథ కాలక్షేపాలతో కాలము గడపవలెను. సాయంత్రకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరంలో వున్న శివుని కల్పోక్తంగా ఈ క్రింది విధంగా పూజించాలి.

కార్తీకమాస శివపూజా కల్పము

1. ఓం శివాయ నమః – ధ్యానం సమర్పయామి
2. ఓం పరమేధ్వరాయ నమః – ఆవాహనం సమర్పయామి
3. ఓం కైలాసవాసాయ నమః – నవరత్న సింహాసనం సమర్పయామి
4. ఓం గౌరీనాథాయ నమః – పాద్యం సమర్పయామి
5. ఓం లోకేశ్వరాయ నమః – అర్ఘ్యం సమర్పయామి
6. ఓం వృషభవాహనాయ నమః – స్నానం సమర్పయామి
7. ఓం దిగంబరాయ నమః – వస్త్రం సమర్పయామి
8. ఓం జగన్నాథాయ నమః – యజ్ణోపవితము సమర్పయామి
9. ఓం కపాలధారిణే నమః – గంధం సమర్పయామి
10. ఓం సంపూర్ణ గుణాయ నమః – పుష్పం సమర్పయామి
11. ఓం మహేశ్వరాయ నమః – అక్షతాన్ సమర్పయామి
12. ఓం పార్వతీనాథాయ నమః – ధూపం సమర్పయామి
13. ఓం తేజోరూపయ నమః – దీపం సమర్పయామి
14. ఓం లోకరక్షాయ నమః – నైవేద్యం సమర్పయామి
15. ఓం త్రిలోచనాయ నమః – కర్పూర నీరాజనం సమర్పయామి
16. ఓం శంకరాయ నమః – సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
17. ఓం భవాయ నమః – ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

ఈ ప్రకారంగా కార్తీకమాసంతా పూజించవలెను. శివసన్నిదిన దీపారాధన చేయవలెను. అల చేసిన యెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తికొద్ది బ్రాహ్మణులకు సమారధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను.

ఇలా చేస్తే నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసం నెల రోజులు బ్రాహ్మణ సమారధన,

శివకేశవుల సన్నిధిన నిత్యదీపారాధన, తులసికోటవద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన యెడల వారీకి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును.

శక్తి వుండీ కూడా ఈ వ్రతమును చేయనివారు వంద జన్మలు నానాయోనులయందు జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి , ఎలుక మొదలగు జన్మలెత్తుతారు.

ఈ కార్తీకమాస వ్రతమును శాస్త్రోక్త విధిగా ఆచరించిన యెడల పదిహేను జన్మలయొక్క పూర్వజ్ణానము కలుగును. వ్రతము చేసిన, పురాణము చదివిన, వినిన అటతివారికి దకలైశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి పొందుతారు.

పదునాల్గవరోజు పారాయణము సమాప్తము.

check Karthika Purana – Chapter 4 :

Leave a Reply

%d bloggers like this: