Sri Karthika Puranam Chapter 12 :

0
165
Sri Karthika Puranam Chapter 19
Sri Karthika Puranam Chapter 19

Sri Karthika Puranam Chapter 12 – శ్రీ కార్తీక పురాణము 12వ అధ్యాయము – ద్వాదశీ ప్రశంస – కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతము, సాలగ్రామపు మహిమ.. కార్తీక సోమవారమునాడు ఉదయము లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి, ఆచమనము చేయాలి. తర్వాత శక్తికొద్ది బ్రాహ్మణులకు దానధర్మలు చేసి.

ఆ రోజు ఉపవసంవుండి, సాయంకాలము శివాలయంలో కాని, విష్ణ్యాలయమందుగాని వెళ్లి దేవుని పూజించి, నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించాలి. ఈవిధంగా చేసినవారికి సకల సంపదలు కలుగటమే కాక, మోక్షము కూడా పొందుతారు.

కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన యెడల నామవ్రతమాచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును.

కార్తీకశుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి (పూర్తి రోజు ఉపవాసం) ఆరాత్రి విష్ణ్యాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసార ధ్యానించి శ్రీహరిసన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారధన చేస్తే కోటి యజ్ణముల ఫలితము కలుగుతుంది.

ఈ విధంగా చెసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటె అధికంగా ఫలము కలుగుతుంది.

కార్తీక శుద్ధ ద్వాదశీనాడు శ్రీమన్నారాయణుడు శేషపనుపునుండి లేచును కనుక కార్తీకశుద్ద ద్వాదశీ వ్రతమును విష్ణువుకు ఇష్టము.

ఆరోజున శ్రీమంతులైనవారైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి, దూడతోసహా బ్రాహ్మణునకు దానమిచ్చిన యెడల ఆయవు శరీరమందు ఎన్ని రోమాలు వుంటాయో అన్ని సంవత్సరాలు యింద్రలోకములో స్వర్గసుఖలు పొందుతారు.

కార్తీక మాసంలో వస్త్రదానము చేసిన గొప్పఫలము కలుగును. మరియు కార్తీకశుద్ద పౌడ్యమిరోజున, కార్తీకపౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యిపోసి దీపముంచినవారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును.

ద్వాదశినాడు యజ్ణోపవితములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు.

ద్వాదశిరోజున బంగారు తులసిచెట్టును గాని, సాలగ్రామును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన యెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని ధానము చేసిన ఫలము కలుగును. దీనికి ఒక ఉదాహరణము కలదు శ్రద్ధగా చదవండి.

Sri Karthika Puranam Chapter 12
Sri Karthika Puranam Chapter 12

సాలగ్రామ దాన మహిమ

పూర్వము అఖండ గోదావరీ నదీ తీరంలో ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివస్తిస్తుండెను.

వాడి అతి దురశాపరుడై నిత్యము ధనమును కూడపెడుతూ, తాను అనుభవించక, ఇతరులకు పెట్టక, బీదలకు దానధర్మలు చేయక, ఎల్లప్పుడు పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ ఏజీవికి కూడా ఉపకారమైనా చేయక ‘ పరుల ధనాని ఎలా అపరించాలా’ అని తలుస్తూ కుత్సితబుద్ధి కలిగి కాలము గడుపుతుండెను.

అతడొకనాడు తన గ్రామానికి సమీపంలో వున్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు తనవద్ద వున్న ధనమును పెద్దవడ్డీకి అప్పుయిచ్చెను. మరికొంత కాలానికి తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు ” అయ్యా! తమకీయవలసిన ధనమును ఒక నెలరోజుల గడువులో ఇవ్వగలను.

మీ ఋణముంచుకోను, ఈ జన్మలో తీ చనియెడల మరుజన్మలో మీయింట ఏ జంతువుగానో పుట్టి అయిన మీ ఋణము తీర్చుకోగలను” అని సవినయముగా వేడుకొనెను.

ఆ మాటలకు కోమటి మండిపడి “అలా వీలులేదు, అని ఆవేశము కొద్ది వెనకముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గొంతుకోసెను. వేంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను.

ఆ కోమటి బయపడి అక్కడే వున్నచో రాజభటులు వచ్చి పట్టుకొంటారని జడసి తన గ్రమమునకు పారిపోయెను.

బ్ర్రాహ్మణహత్య మహాపాపము కనుక అప్పటినుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపమావహించి కుష్ఠివ్యాధి కలిగి నానా బాధలు పడితూ కొన్నాళ్లకు మరణించెను.

వేంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొనిపోయి నరక కూపములో పడద్రోసిరి.

ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగ్గట్లుగానే తండ్రి సంపదించిన ధనమును దానధర్మలు చేస్తూ పుణ్యకార్యలు ఆచారిస్తూ, నీడకొరకై చెట్లూ నాటిస్తూ, నూతులు, చెరువులు త్రవ్విస్తూ సకల జనులను సంతీషపెడ్తూ మంచికీర్తి సంపాదించెను.

ఇలావుండగా కొంతకాలానికి త్రిలోకసంచారి అయిన నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి, త్రోవలో ధర్మవీరుడి ఇంటికి వీచ్చెసారు.

ధర్మవీరుడు నారధులవారికి సాష్టంగ దండ ప్రణామము లాచరించి, విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి, చేతులు జోడించి ” మహానుభావ! నా పుణ్యంకొలది నేడు తమ దర్శనము లభించింది. నేను ధన్యుడను, నా జన్మ తరించినది.

నా ఇల్లు పావనమైనది, శక్తికొద్ది నేను జేయు సత్కారములను స్వీకరించి తమరువచ్చిన కార్యమును వీశదీజరించండి” అని సవినయుడై వేడుకొనెను.

అంత నారదుడు చిరునవ్వు నవ్వి “ఓ ధర్మవీర! నేను నీకొక హితము చెప్పదలచి వచ్వితిని. శ్రీమహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశీ మహాప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన, దాన, జపాదులు చేసిన అత్యంత ఫలము కలుగును.

నాలుగు జాతులలో ఏ జాతివారైనా, స్త్రీ అయిన పురుషుడైనా, జారుడనా, చోరుడనా, పతివ్రతాయైనా, వ్యభిచారిణియైనా కార్తీక శుద్ధ ద్వాదశీ రోజున సూర్యుడు తులారాశియందు వుండగా నిష్ఠగా ఉపవసంవుండి, సాలగ్రాములు దానము చేసిన యెడల వెనుకటి జన్మలందు, ఈ జన్మమందూ చేసిన పాపములు పోవును.

నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవిస్తున్నాడు. అతనిని ఉద్దరించటానికి నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు.

అట్లుచేసి నీ తండ్రి ఋణము తీర్చుకొనుము.” అని చెప్పెను. అప్పుడు ధర్మవీరుడు” నారద మునివర్యా! నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానలు చేసివున్నను.

అటువంటి దానములు చేయగా నాతండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ ” సాలగ్రామ” మనే రాతిని దానము చేసినంత మాత్రాన అతని ఎలా ఉద్దరింపబడతాడని నాకు సంశయముగా కలుగుతున్నది.

దీనివలన ఆకలిగొన్న వాని ఆకలితీరునా! దాహముగొన్న వానికి దాహము తీరునా? కాక, ఎందుకీ దానమును చేయవలెను? నేనీ సాలగ్రామదానమును మాత్రము చేయజాలను” అని నిష్కర్షగా పలికెను.

ధర్మవీరుని అవివేకానికి విచారించి ” వైశ్యుడా! సాలగ్రామమును శిలామాత్రంగా అలోచించావు, అది శిలకాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానములకంటే సాలగ్రామదానము చేస్తే కలిగే ఫలమే గొప్పది.

నీ తండ్రిని నరకబాధనుండి విముక్తి చేయాలని తలంచిన నీకు ఈ దానము తప్ప మరొక మార్గము లేదు” అని చెప్పి నారదుడు వెళ్లిపోయెను.

ధర్మవీరుడు ధనబలము గలవాడై వుండి, దాన సామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలానికి అతడు చనిపోయేను.

నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుటచేత మరణాంతరం ఏడు జన్మలయందు పులిగా పుట్టి, మరిమూడు జన్మలందు వానరమై పుట్టి, ఐదుజన్మలు ఎద్దుగా పుటి, పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి, పది జన్మలు పందిగా జన్మించి వుండెను.

అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేదబ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యౌవనకాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంశునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలనికి ఆమె భర్త చనిపోయెను.

చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందుకు తల్లితండ్రులు బంధుమిత్రులు చాల దుఃఖించిరి.

తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగెనాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెచేత సాలగ్రామదానము చేయించి ” నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక” అని చెప్పించి సాలగ్రామ దానఫలము ధారవోయించెను.

ఆరోజు కార్తీక సోమవారమగుటవలన ఆ సాలగ్రామ ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి, జన్మతరమున స్వర్గనికెగిరి.

మరికొంతకాలానికి ఆ బ్ర్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేస్తూ ముక్తిపొందెను.
కావున! కార్తీకశుద్ధ ద్వాదశిరోజున సాలగ్రామ దానముచేసిన దాని ఫలము ఇంతింతకాదు. ఎంతో ఘనమైనది. మీరుకూడా ఆ సాలగ్రామ దానము శక్తిమేర చేయండి.

పన్నెండవరోజు పారాయణము సమాప్తము

check Vaishakha Puranam – Chapter 2

Leave a Reply