Daily Horoscope 14/11/2021 :

0
228

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

14, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము
శరదృతువు దక్షిణాయనము

ఈ రోజుటి రాశిఫలాలు
14 నవంబర్ 2021
ఆదివారం NOVEMBER 14

Daily Horoscope 14/11/2021
Daily Horoscope 14/11/2021

మేషం

అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1,
బంధువుల నుంచి విమర్శలు.కుటుంబ సభ్యులతో వివాదాలు. ఉద్యోగస్తులకు అధికారులతో ఆకస్మిక పర్యటించాల్సివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. మీ పనులు, కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఊహించని ఖర్చులు ఉంటాయి. ఆత్మీయులు, ప్రముఖులను కలుసుకుంటారు. క్రయ విక్రయాలు సామాన్యం. కళారంగాల వారికి విదేశీ పర్యటనలలో ఆటంకాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. ఇంటాబయటా బాధ్యతలు. అనారోగ్యం, ఔషధ సేవనం.

వృషభం

కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2,
రియల్ ఎస్టేట్ల వారికి చిక్కులు. ఉద్యోగులకు పనిభారం. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. మీ వాహనం లేక విలువైన వస్తువు ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. రుణం ఏ కొంతయినా తీర్చాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది.వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఆలోచనలు నిలకడగా ఉండవు.

మిథునం

మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3,
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇతరులు చెప్పిన మాటపై దృష్టి పెట్టకండి. ఆరోగ్యం కుదుట పడటంతో ఒకింత ఊరట చెందుతారు. రాజకీయ, కళారంగాల వారికి శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విద్యార్థులలో పట్టుదల, విద్యా విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.అనుకున్నవి సాధించి, ఎనలేని తృప్తిని పొందుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.ఆస్తి వివాదాలు తీరతాయి.ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి

కర్కాటకం

పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4,
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. సన్నిహితులతో వివాదాలు.మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. స్టేషనరీ, ప్రింటింగు రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి.కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి.రాజకీయ, సాంకేతికరంగాల వారికి అనుకూల పరిస్థితులు.

సింహం

మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1,
ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉంటాయిఆరోగ్య భంగం. ఔషధ సేవనం. సన్నిహితులతో విభేదాలు.
ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. కాంట్రాక్టర్లకు నిరాశ.వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. ప్రయాణాల్లో మార్పులు. ఐటీ నిపుణులకు గందరగోళం.పారిశ్రామిక,కళా రంగాల వారికి చికాకులు
.మానసిక ఆందోళన. మీ సృజనాత్మక శక్తికి,
మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది
.రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

కన్య

ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2,
ఆరోగ్య భంగం. పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. మీ సమర్థతను సహోద్యోగులు తమ ప్రతిభగా చాటుకుంటారు.వ్యాపారాలలో ఆటుపోట్లు.రియల్ ఎస్టేట్ల వారికి ఒత్తిడులు. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. వివాదాలు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగులకు స్థాన మార్పు. వ్యవహారాలు ముందుకు సాగవు.బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. వైద్యరంగంలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం.రాబడి నిరాశ కలిగిస్తుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు.

తుల

చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3,
వాహనాలు, స్థలాలు కొంటారు. ప్రత్యర్థుల నుంచి సైతం సాయం అందుతుంది. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కానవచ్చిన ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. ఆలోచనలు అమలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. మీ తొందరపాటుతనం వల్ల సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. విద్యార్థునులకు తోటివారి ఆకారణంగా సమస్యలు తలెత్తుతాయి. కొత్త పరిచయాలు.మీ కళత్రమొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు.శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు

వృశ్చికం

విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4,
రియల్ ఎస్టేట్ల వారికి వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో ఉన్నతపోస్టులు దక్కే సూచనలు. ఇంజనీరింగ్, ఆడిట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. స్త్రీలకు పనిలో ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయి. రాజకీయ,కళారంగాల వారికి శుభవర్తమానాలు. ప్రభుత్వ అధికారులకు నూతన వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.కొత్త వ్యాపారాలు చేపడతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు

ధనుస్సు

మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
శారీరక రుగ్మతలుమానసిక ఆందోళన… సన్నిహితులతో విభేదాలు. సిమెంటు, బరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది.చిన్నతరహా పరిశ్రమలు, వృత్తులు, కార్మికులకు సామాన్యం. రావలసిన ధనం వసూలు విషయంలో ఓర్పు, లౌక్యం ఎంతో అవసరం. ఒప్పందాలు వాయిదా. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.ఆకస్మిక ప్రయాణాలు. మీరు ఆశించే వ్యక్తుల నుండి కావలసిన సమాచారం అందుతుంది. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.వ్యాపారాలలో ఆటుపోట్లు.

మకరం

ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2,
ఆలోచనలు కలసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.విలువైన సమాచారం. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి ధోరణి నిరుత్సాహం కలిగిస్తుంది. ఖర్చులు అధికం. రియల్ ఎస్టేట్ రంగాల వారు నూతన వెంచర్లకు సంబంధించిన విషయాలలో పునరాలోచన అవసరం. రియల్ ఎస్టేట్ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది
సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు.కుటుంబసభ్యులతో విభేదిస్తారు.గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధానపరుస్తారు.

కుంభం

ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3,
ఉద్యోగాల్లో సమస్యలు తీరతాయి.పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం, త్రిప్పట అధికమవుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలించవు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.ప్రతి పని చేతి దాకా వచ్చి వెనక్కి పోవుట వల్ల కాంట్రాక్టర్లకు చికాకు తప్పదు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలన్విగలవు.రియల్ ఎస్టేట్ల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం

పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4,
ఉద్యోగాలలో చికాకులు. కళా రంగాల వారికి మనశ్శాంతి లోపిస్తుంది. ఆర్థిక విషయాల్లో అనుకున్నంత సంతృప్తి కానరాదు. స్త్రీలకు చుట్టు పక్కల వారితో సమస్యలు అధికం అవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తీరతాయి.భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి.
మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. రిప్రజెంటేటి‌వ్‌లకు, పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు.శారీరక రుగ్మతలు. సన్నిహితులతో విభేదాలు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

Panchangam

పంచాంగం
తేది : 14, నవంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి
(నిన్న ఉదయం 9 గం॥ 23 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 42 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాభద్ర
(నిన్న రాత్రి 7 గం॥ 36 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 45 ని॥ వరకు)
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 40 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 7 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 22 ని॥ లకు

check Daily Horoscope 09/10/2021 :

Leave a Reply