Daily Horoscope 13/11/2021 :

0
167

Daily Horoscope 13/11/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

12, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము
శుక్ల నవమి
శరదృతువు దక్షిణాయనము

13 నవంబర్ 2021
శనివారం NOVEMBER 13 ఈ రోజు రాశి ఫలాలు

మేషం

అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1,
సాహిత్య సదస్సులలోను, బృంద కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.ఉద్యోగ యత్నాలు సఫలం.చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.ఆహ్వానాలు రాగలవు
ఖర్చులు ముందుగానే ఊహించినవి కావటంతో ఇబ్బందులు తలెత్తవు.భూ,గృహయోగాలు.వృత్తులు, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి

వృషభం

కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2,
వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలుదైవ,సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు.స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ వహించండి.దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వస్తులాభాలు.వాహన యోగం.వృత్తులు, వ్యాపారాలలో మరింత పురోగతి.

Daily Horoscope 13/11/2021
Daily Horoscope 13/11/2021

మిథునం

మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3,
రాబడి అంతగా లేక అప్పులు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. మీ సంతానం అతిగా వ్యవహరించటం
వల్ల మాటపడక తప్పదు.వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం.రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. హామీలు,మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు. అదనపు బాధ్యతలు

కర్కాటకం

పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4,
విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి.ప్రయాణాలలో మార్పులు. ఖర్చులు పెరుగుతాయి.కార్యక్రమాలు కొన్ని నెమ్మదిగా సాగుతాయి
గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు నవ్వులపాలు అవును.వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు

సింహం

మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1,
ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి పెంచుకుంటారు.కుటుంబంలో ఇబ్బందులు ఎదురు
కావచ్చు.ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రేమికులకు మధ్య వేదాంత ధోరణి కానవస్తుంది.మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు.కొత్తగా అప్పులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు అనుకోని ప్రయాణాలు
స్నేహితులతో వివాదాలు.

కన్య

ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2,
ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విరోధాలు. వ్యయప్రయాసలుఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి,హడావిడి అధికంగా ఉంటాయి.ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయొద్దు.స్వల్ప రుగ్మతలు.ప్రత్యర్థులు మిత్రులుగామారి దైవకార్యాల్లో పాల్గొంటారు.ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి.ముఖ్యులతో సరదాగా గడుపుతారు.వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

తుల

చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3,
తీర్థయాత్రలు, విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది.కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.స్త్రీలు విలువైన బంగారు వస్తువులపై దృష్టి సారిస్తారు.ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వల్ల పైఅధికారులతో మాటపడక తప్పడు.మిత్రులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం
నిరుద్యోగులకు శుభ వార్తలు.స్థిరాస్తి కొనుగోలు వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చికం

విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4,
వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. మీ కళత్ర మొండి వైఖరి వల్లకుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం.శుభవార్తలు వింటారు.ఆదాయం మెరుగ్గా ఉంటుంది.రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు.సమయానుకూలంగా మీ కార్యక్రమాలు,ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.ఆత్మీయుల అతిథి మర్యాదలు సంతృప్తిని ఇస్తాయి.

ధనుస్సు

మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
సన్నిహితుల నుంచి సమస్యలు.స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు.గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.వృత్తులు,వ్యాపారాలలో నిరుత్సాహం. రాజకీయవేత్తలకు గందరగోళం.స్టేషనరీ,ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పుల వల్ల మాటవపడతారు. విందులు, వినోదాల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. ప్రముఖుల కలియిక ప్రయోజనకరంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు.ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటుంది.మిత్రులను కలుసుకుంటారు.

మకరం

ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2,
ఆస్తి వివాదాలు తీరతాయి.అదనపు ఆదాయం లభిస్తుంది
మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పరిచయాల వల్ల మీ జీవితం ఊహించని మలుపు తిరుగబోతోంది.వ్యాపార,ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.వాహనంకొనాలనే ఆలోచన క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరుతుంది. ఇతరులకు సలహా ఇవ్వటం వల్ల మాటపడవలసి వస్తుంది.కొత్త విషయాలు తెలుసుకుంటారు.ప్రముఖులతో పరిచయాలు.

కుంభం

ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3,
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో ఆదరణ. కుటుంబంలో శుభకార్యాలు.ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి జయం పొందండి.రాబోయే సమస్యలను తేలికగా గ్రహించడం వల్ల రాజకీయాల్లో వారు కుదుటపడతారు. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది.ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు.వాహన సౌఖ్యం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీనం

పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4,
శారీరక రుగ్మతలు. వృథా ఖర్చులు.వాతావరణంలో మార్పు మీకెంతో చికాకు కలిగించగలదు.రాజకీయ నాయకులు సభలు,సమావేశాలు,శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధువుల రాకతో మీలో ఉల్లాసం, ఉత్సాహం అధికమవుతుంది.అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు నిరాశ. కొన్ని కార్యాలలో జాప్యం. వృత్తి,వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.స్నేహితులతో వివాదాలు. స్త్రీలకు పరిచయాలు అధికమవుతాయి

Panchangam

శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం, నవంబర్ 13, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి ఉ. 9-22 తదుపరి దశమి
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:శతభిషం రా7.35వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం:ధృవం ఉ8.15 తదుపరి వ్యాఘాతం
కరణం:కౌలువ ఉ9.22 తదుపరి తైతుల రా9.02 ఆ తదుపరి గరజి
వర్జ్యం:రా2.01 – 3.38
దుర్ముహూర్తం:ఉ6.15 – 7.46
అమృతకాలం:ఉ12.28 – 2.03
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:6.06
సూర్యాస్తమయం:5.22

check Daily Horoscope 03/11/2021 :

Leave a Reply