
Sri Karthika Puranam – Chapter 8 – శ్రీ కార్తీక పురాణము – 8వ అధ్యాయము – శ్రీహరినామస్మరణ – సర్వఫలప్రదము – ధర్మము మూడు రకాలు అవి సాత్విక, రాజస, తామసములు. సాత్వికము అనగా దేశకాల పాత్రలు మూడునూ సమయాన సత్త్వామనే గుణము జనించి ఫలమంతా పరమేశ్వరార్పితము గావించి, మనోవాక్కయ కర్మలచే నొనర్చిన ధర్మము.
ఆ ధర్మమందు ఎంతో ఆధిక్యత కలదు. సాత్త్విక ధర్మము సమస్త పాపములు నాశనమొనర్చి పవిత్రలను చేసి దేవలోక సుఖములు చేకూర్చును.
ఉదాహరంగా తామ్రపర్ణినది సముద్రంలో కలిసే తావునందు స్వాతికార్తెలో ముత్యపుచిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి, ముత్యంగ మారే విధంగా సాత్త్వికత వహించి, సాత్త్వికధర్మము ఆచరిస్తూ గంగ, యమున, గోదావరి, కృష్ణానదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందూ, దేవలయాలందూ వేదాలు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణుడు ఎంత స్వల్పదానము చేసినా లేక దేవాలంలో జపతపాదులు ఒనరించినను విశేషఫలమును పొందగలరు.
రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్తవిధులు విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలను కలిగించునదగును.
తామస ధర్మమనగా శాస్త్రోక్తవిధులను విడివి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచరణార్ధము చేయు ధర్మము. ఆ ధర్మము ఫలమునీయదు.
దేశకాలపాత్రముల సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని ఏ స్వల్పధర్మమును చేసిననూ గొప్పఫలము నిచ్చును.
అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము, తెలిసిగాని, తెలియకగాని ఉచ్ఛరించిన వారి సకల పాపములు పోయి ముక్తిపొంపుతారు. దీనికొక ఇతిహాసము కలదు.

అజామీళుని కథ
పుర్వకాలంలో కన్యాకుబ్జము అనే నగరంలో నాల్గువేదాలు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అనే భార్య కలదు.
ఆ దంపతులు అన్యోన్య ప్రేమకలిగి అపూర్వ దంపతులు అని పేరు బడసిరి. వారికి చాలాకాలానికి లేకలేక ఒక కుమారుడు జన్మించాడు.
వారు ఆ బాలున్ని అతిగారబంగా పెంచుతూ, అజామీళుడని పేరు పెట్టరు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతిగారాబం వలన పెద్దలను కూడ నిర్లక్ష్యంగా చూస్తూ, దుష్టసాహవాసములు చేస్తూ, విధ్యను అభ్యసించకుండా, బ్రాహ్మణధర్మలు పాటించక సంచరిస్తూండేవాడు.
ఈ విధంగా కొంతకాలానికి యవ్వనంరాగా కామాంధుడై, మంచిచెడ్డలు మరచి, యజ్ణోపవితము త్రెంచి, మద్యన్ని సేవిస్తూ, ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరం ఆమెతో కామక్రీడలలో తేలియాడుతూ, ఇంటికి రాకుండా, తల్లితండ్రులను మరచి, ఆమె ఇంట్లోనే భుజించేవాడు.
ఆ విధంగా అజామీళుడు కులభ్రష్టుడు కాగా, అతని బందువులు అతనిని విడిచిపెట్టారు. అందుకు అజామీళుడు రెచ్చిపొయి వేటవలన పక్షులు, జంతువులను చంపుతూ కిరాతకవృత్తితో జీవిస్తుండెవాడు.
ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను.
అజామీళుడు ఆస్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి, తరువాత అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకల దానికి అంతక ముందే ఒక కుమార్తె వుండెని.
కొంత కాలనికి ఆ బాలికకు యుక్తావయస్సురాగా కామాంధకారంచే కన్నుమిన్నుగానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుతూ వుండెను.
వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్బం ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరు ఆ బాలునికి “నారాయణ” అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్కక్షణమైనా ఆ బాలున్ని విడువక ఎక్కడికి వెళ్లినా వెంటబెట్టుకొని వెల్తూ ” నారాయణా – నారాయణా” అని ప్రేమతో సాకుచుండిరి.
కాని “నారాయణ” అని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను.
ఇట్లు కొంతకాలానికి అజామీళునికి శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచముపట్టి చావుకి సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకర ఆకారములతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూసి అజామీళుడు భయము చెంది కుమారునిపై వున్న వత్సల్యము వలన ప్రాణములు విడువలేక “నారాయణా” “నారాయణా” అంటు ప్రాణలు విడిచెను.
అజామీళుని నోట “నారాయణా” అను శబ్దము వినబడగానే యమబటులు గడగడ వణకసాగిరి. అదేవెళకు దివ్య మంగళాకారులు, శంఖ చక్ర గదాధరులూ అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అక్కఫికి వచ్చి” ఓ యమభటులారా! వీడు మావాడు.
మేము వీనిని వైకుంఠనికి తిసుకుపొవాడనికి వచ్చము” అని చెప్పి అజామీళుని వీమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు “అయ్యా! మీరెవరు? వీడు అతిదుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవడానికి మేము వచ్చము కవున వానిని మాకు వపులుము అమి కోరగ విష్ణు దూతలు ఇలా చెప్పరు.
ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము
కార్తీక మాస ఎనిమిదవ రోజు దానధర్మ జపతపాది విధులు – ఫలితాలు
పూజించాల్సిన దైవము → దుర్గ
జపించాల్సిన మంత్రము → ఓం చాముండాయై విచ్చే స్వాహా
దానములు → తోచినవి, యథాశక్తి
నిషిద్ధములు → ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
ఫలితము → ధైర్యం, విజయం