Home PANCHANGAM Daily Horoscope 11/11/2021 :

Daily Horoscope 11/11/2021 :

0
Daily Horoscope 11/11/2021 :

Daily Horoscope 11/11/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

11, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము
శుక్ల సప్తమి
శరదృతువు
దక్షణాయనము బృహస్పతి వాసరే
( గురు వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 11/11/2021
Daily Horoscope 11/11/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
కుటుంబ సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి. Daily Horoscope 11/11/2021

 వృషభం

ఈరోజు
తోటివారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

 మిధునం

ఈరోజు
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

 కర్కాటకం

ఈరోజు
శుభకాలం. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో శుభఫలాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తిచేస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

 సింహం

ఈరోజు
గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. కాలం అన్ని విధాలుగా సహకరిస్తోంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మంచిది.

 కన్య

ఈరోజు
సంపూర్ణ మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.ఆంజనేయస్వామిని ఆరాధించాలి

 తుల

ఈరోజు
ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి, వాటిని ప్రారంభిస్తారు. శ్రీ వేంకటేశ్వర శరణాగతిస్తోత్రం పఠనం మంచిది. Daily Horoscope 11/11/2021

 వృశ్చికం

ఈరోజు
బంధు,మిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి

 ధనుస్సు

ఈరోజు
మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.

 మకరం

ఈరోజు
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. చక్కటి ఫలితాలను పొందుతారు. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. మీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. దైవారాధన మానవద్దు.

 కుంభం

ఈరోజు
ప్రారంభించబోయే పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. తోటివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. నవగ్రహధ్యానం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

 మీనం

ఈరోజు
ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకూలతను సాధిస్తారు. మనఃసౌఖ్యం ఉంది. శివ స్తోత్రం పఠనం శుభప్రదం. Daily Horoscope 11/11/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
గురువారం, నవంబర్ 11, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి మ12.01 తదుపరి అష్టమి
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:శ్రవణం రా8.33వరకు తదుపరి ధనిష్ఠ
యోగం:గండం మ12.48 ఆ తదుపరి వృద్ధి
కరణం:వణిజ మ12.01తదుపరి విష్ఠి రా11.16 ఆ తదుపరి బవ
వర్జ్యం :ఉ12.26 – 1.59
దుర్ముహూర్తం:ఉ9.51 – 10.36 &
మ2.21 – 3.06
అమృతకాలం:ఉ10.36 – 12.08
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ /
కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:6.06
సూర్యాస్తమయం:5.22

check Daily Horoscope 01/11/2021 :

Leave a Reply

%d bloggers like this: