Daily Horoscope 10/11/2021 :

0
Daily Horoscope 10/11/2021 :

Daily Horoscope 10/11/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

10, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము
శుక్ల షష్ఠి
శరదృతువు
దక్షణాయనము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 10/11/2021
Daily Horoscope 10/11/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య ఈవారం పరిష్కారం అవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. గణపతిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి. Daily Horoscope 10/11/2021

వృషభం

ఈరోజు
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మంచిది.

 మిధునం

ఈరోజు
ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాల వల్ల మంచి జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమయానికి నిద్రాహారాలు అవసరం. శివారాధన శుభప్రదం.

 కర్కాటకం

ఈరోజు
అనుకూల వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. గణనాయకాష్టకం పఠిస్తే మంచిది.

 సింహం

ఈరోజు
అనుకున్న పనిని వెంటనే పూర్తిచేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. ప్రశాంతమైన జీవనం ఉంది. లక్ష్మీ ఆరాధన మంచిది. Daily Horoscope 10/11/2021

 కన్య

ఈరోజు
భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. శివారాధన శుభప్రదం.

 తుల

ఈరోజు
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయసహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శక్తిని ఇస్తుంది.

 వృశ్చికం

ఈరోజు
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాయిబాబా సచ్చరిత్ర పఠిస్తే బాగుంటుంది.

 ధనుస్సు

ఈరోజు
ప్రారంభించే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తినిస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

 మకరం

ఈరోజు
దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల విషయమై పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. _ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం. _

 కుంభం

ఈరోజు
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

 మీనం

ఈరోజు
మీ మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది. Daily Horoscope 10/11/2021

Panchangam

పంచాంగం
తేది : 10, నవంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి
(నిన్న సాయంత్రం 3 గం॥ 58 ని॥ నుంచి
ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 52 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(నిన్న రాత్రి 10 గం॥ 55 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 34 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 6 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 56 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 1 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు రాత్రి 2 గం॥ 55 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 10 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 5 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 23 ని॥ లకు

check Daily Horoscope 09/10/2021 :

Leave a Reply

%d bloggers like this: