
Daily Horoscope 09/11/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
09, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము
శుక్ల పంచమి
శరదృతువు
దక్షణాయనము భౌమ వాసరే
( మంగళ వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ కాస్త పెరగుతుంది. కుటుంబసభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. లలితాదేవి నామాన్ని స్మరించాలి. Daily Horoscope 09/11/2021
వృషభం
ఈరోజు
మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యాలను ప్రారంభం చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చంద్రధ్యానం శుభప్రదం.
మిధునం
ఈరోజు
మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.
కర్కాటకం
ఈరోజు
స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు పొందుతారు. అభివుద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు.
సింహం
ఈరోజు
చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.
కన్య
ఈరోజు
మిశ్రమకాలం. శారీరక శ్రమ పెరగవచ్చు. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయల్లో ప్రశాంతంగా ఆలోచించండి మంచి చేకూరుతుంది. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి పఠించాలి. Daily Horoscope 09/11/2021
తుల
ఈరోజు
వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తుంది. ముఖ్య విషయాల్లో పరిరక్షణ అవసరం. మానసిక ప్రశాంతత కోసమై వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.
వృశ్చికం
ఈరోజు
మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. గిట్టనివారితో జాగ్రత్త. వాగ్వాదాలు చేయకండి శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర శనామావళి పఠించడం మంచిది.
ధనుస్సు
ఈరోజు
ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బుకు చేతికి అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
మకరం
ఈరోజు
చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.
కుంభం
ఈరోజు
శ్రమతోకూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది . ఇష్టదైవారాధన శుభప్రదం.
మీనం
ఈరోజు
అనుకున్న పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. శారీరక శ్రమ పెరిగినా అందుకు తగిన ఫలితాలు లభించడం వలన సంతోషంగా ఉంటారు. దుర్గాస్తుతి పఠించాలి. Daily Horoscope 09/11/2021
Panchangam
ఓం శ్రీగురుభ్యోనమః
శుభమస్తు
శ్రీ ప్లవ సంవత్సర
తేది : 09, నవంబర్ 2021
సంవత్సరం : స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవ నామ సంవత్సరం
ఆయనము : దక్షిణాయనము
ఋతువు : శరదృతువు
కాలము : వర్షా కాలం
మాసం : కార్తీక మాసము
పక్షం : శుక్ల పక్షం తిథి : పంచమి
( ఈరోజు పగలు 10 గం ౹౹ 38 ని ౹౹ వరకు )
వారము : భౌమ వాసరే ( మంగళ వారము )
నక్షత్రం : పూర్వాషాఢ
( ఈరోజు సాయంత్రం 05 గం ౹౹ 03 ని ౹౹ వరకు )
యోగము : ధృతి
( ఈరోజు పగలు 12 గం ౹౹ 08 ని ౹౹ వరకు )
కరణము : బాలవ
( ఈరోజు పగలు 10 గం ౹౹ 38 ని ౹౹ వరకు )
అనంతరం
కౌలవ
( ఈరోజు రాత్రి 09 గం ౹౹ 33 ని ౹౹ వరకు )
వర్జ్యం
(ఈరోజు రాత్రి 12 గం ౹౹ 37 ని ౹౹ లగాయతు 02 గం ౹౹ 08 ని ౹౹ వరకు )
అమృత ఘడియలు :
(ఈరోజు పగలు 12 గం ౹౹ 37 ని ౹౹ లగాయతు 02 గం ౹౹ 08 ని ౹౹ వరకు )
దుర్ముహూర్తం :
(ఈరోజు పగలు 08 గం ౹౹ 36 ని ౹౹ లగాయతు 09 గం ౹౹ 22 ని ౹౹ వరకు )
మరల
(ఈరోజు రాత్రి 10 గం ౹౹ 44 ని ౹౹ లగాయతు 11 గం ౹౹ 35 ని ౹౹ వరకు )
సూర్యోదయం : ఉదయం 06 గం॥ 21 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05 గం॥ 38 ని॥ లకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : ధనస్సు
కార్తె : విశాఖ
శార్దతిధి: షష్ఠి