Home PANCHANGAM Daily Horoscope 07/11/2021 :

Daily Horoscope 07/11/2021 :

0
Daily Horoscope 07/11/2021 :

Daily Horoscope 07/11/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

07, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము
శుక్ల తృతీయ
శరదృతువు
దక్షణాయనము భాను వాసరే
( ఆది వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 07/11/2021
Daily Horoscope 07/11/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మనస్సౌఖ్యం ఉంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల పట్ల కాలాన్ని వృథా చేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. Daily Horoscope 07/11/2021

వృషభం

ఈరోజు
విశేషమైన శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అంతటా విజయం ఉంది. శనిధ్యానం పఠించాలి.

 మిధునం

ఈరోజు
ప్రారంభించిన పనులు పనులు చకచకా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు దానం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ మంచిది.

 కర్కాటకం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక విషయాల్లో ద్వంద్వ వైఖరిని విడనాడాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

 సింహం

ఈరోజు
శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి.

 కన్య

ఈరోజు
మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

 తుల

ఈరోజు
చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. నవగ్రహ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది. Daily Horoscope 07/11/2021

 వృశ్చికం

ఈరోజు
ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. మనస్సౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

 ధనుస్సు

ఈరోజు
శుభకాలం. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి,ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

మకరం

ఈరోజు
అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. లక్ష్మీదేవి ఆలయ దర్శనం శుభప్రదం.

 కుంభం

ఈరోజు
శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.

 మీనం

ఈరోజు
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు పఠిస్తే బాగుంటుంది. Daily Horoscope 07/11/2021

Panchangam

పంచాంగం
తేది : 7, నవంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(నిన్న రాత్రి 10 గం॥ 56 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 34 ని॥ వరకు)
నక్షత్రం : జ్యేష్ట
(ఈరోజు తెల్లవారుజామున 3 గం॥ 40 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 2 గం॥ 00 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 8 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 22 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 40 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 4 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 24 ని॥ లకు

check Daily Horoscope 09/10/2021 

Leave a Reply

%d bloggers like this: