Daily Horoscope 06/11/2021 :

0
Daily Horoscope 06/11/2021 :

Daily Horoscope 06/11/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

06, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము
శుక్ల ద్వితీయ
శరదృతువు
దక్షణాయనము స్థిర వాసరే
( శని వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 06/11/2021
Daily Horoscope 06/11/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.

 వృషభం

ఈరోజు
మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

 మిధునం

ఈరోజు
మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

 కర్కాటకం

ఈరోజు
ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనులలో విజయదుందుభి మ్రోగిస్తారు. శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది.

 సింహం

ఈరోజు
బంగారు భవిష్యత్తుకై వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

 కన్య

ఈరోజు
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

 తుల

ఈరోజు
పనిలో శ్రమ పెరిగినప్పటికీ మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. దుర్గ ధ్యానం శుభప్రదం.

వృశ్చికం

ఈరోజు
మంచి కాలం. కాలాన్ని సత్కార్యాలు వినియోగించండి గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త మనస్సంతోషాన్ని కలిగిస్తుంది. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.

 ధనుస్సు

ఈరోజు
ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది.

మకరం

ఈరోజు
మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వార్తలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం పఠించాలి.

కుంభం

ఈరోజు
మీలోని నిబద్ధతే మిమ్మలి రక్షిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

 మీనం

ఈరోజు
మధ్యమ ఫలితాలున్నాయి. బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తవ్వవు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్ళండి మంచి జరుగుతుంది. ఆంజనేయ సందర్శనం శుభప్రదం.

Panchangam

పంచాంగం
తేది : 6, నవంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ
(నిన్న రాత్రి 1 గం॥ 17 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 56 ని॥ వరకు)
నక్షత్రం : అనూరాధ
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 19 ని॥ నుంచి
ఈరోజు రాత్రి తెల్లవారుజామున 3 గం॥ 40 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 6 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 41 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 3 గం॥ 00 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 2 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 26 ని॥ లకు

check Daily Horoscope 09/10/2021 :

Leave a Reply

%d bloggers like this: