Home PANCHANGAM Daily Horoscope 05/11/2021 :

Daily Horoscope 05/11/2021 :

0
Daily Horoscope 05/11/2021 :

Daily Horoscope 05/11/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

05, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము
శుక్ల ప్రతిపత్
శరదృతువు
దక్షణాయనము భృగు వాసరే
( శుక్ర వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 05/11/2021
Daily Horoscope 05/11/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధు,మిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కనకధారాస్తవం పారాయణ చేయడం వల్ల బాగుంటుంది. Daily Horoscope 05/11/2021

వృషభం

ఈరోజు
సౌభాగ్యప్రాప్తి కలదు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి సాయం చేసేవారు ఉంటారు. యశోవృద్ధి కలదు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నవదుర్గా స్తోత్రం పఠించాలి.

 మిధునం

ఈరోజు
మిశ్రమకాలం. ఒత్తిడి పెరగకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాలకు మీరు ఆశించిన సహాయం అందుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంకా బాగుంటుంది.

 కర్కాటకం

ఈరోజు
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. చతుర్ధంలో చంద్రబలం అనుకూలంగా లేదు. చంద్రధ్యానం శుభప్రదం.

 సింహం

ఈరోజు
ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. Daily Horoscope 05/11/2021

 కన్య

ఈరోజు
కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయానికి తగినట్టు ఖర్చులు ఉంటాయి. గణపతి ఆరాధన శుభప్రదం

 తుల

ఈరోజు
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠనం శుభప్రదం.

వృశ్చికం

ఈరోజు
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

 ధనుస్సు

ఈరోజు
లక్ష్య సాధనలో అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండండి. ఈశ్వరదర్శనం శుభకరం

 మకరం

ఈరోజు
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం.

 కుంభం

ఈరోజు
ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

 మీనం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది. Daily Horoscope 05/11/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః

శుక్రవారం, నవంబర్ 5,2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి రా1.16వరకు తదుపరి విదియ
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:స్వాతి ఉ6.50వరకుతదుపరి విశాఖ తె5.18
యోగం:ఆయుష్మాన్ ఉ9.43 ఆతదుపరి సౌభాగ్యం
కరణం:కింస్తుఘ్నం మ2.21 తదుపరి భబవ రా1.16 ఆ తదుపరి బాలువ
వర్జ్యం: మ12.04 – 1.34
దుర్ముహూర్తం:ఉ8.20 – 9.05 &
మ12.07 – 12.52
అమృతకాలం:రా9.04 – 10.34
రాహుకాలం: రా10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.04
సూర్యాస్తమయం: 5.25
ఆకాశదీప ప్రారంభం

Leave a Reply

%d bloggers like this: