Home PANCHANGAM Daily Horoscope 04/11/2021 :

Daily Horoscope 04/11/2021 :

0

Daily Horoscope 04/11/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

04, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
కృష్ణ అమావాస్య
శరదృతువు
దక్షణాయనము బృహస్పతి వాసరే
( గురు వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 04/11/2021
Daily Horoscope 04/11/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఆటంకాలు ఎదురవకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈశ్వరధ్యానం శుభప్రదం. Daily Horoscope 04/11/2021

 వృషభం

ఈరోజు
కాలానుగుణంగా ముందుకు సాగండి. అనుకున్నది సిద్ధిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

 మిధునం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

కర్కాటకం

ఈరోజు
ఒక శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.

 సింహం

ఈరోజు
కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. అంతా శుభమే జరుగుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం

 కన్య

ఈరోజు
కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. చంద్రశేఖరాష్టకం పఠించాలి.

తుల

ఈరోజు
మిశ్రమ కాలం. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కీలక విషయాల మీద శ్రద్ధను పెంచాలి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. బంధు,మిత్రుల సలహాలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి. మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. శివాలయ దర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది. Daily Horoscope 04/11/2021

 వృశ్చికం

ఈరోజు
కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలలో మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. సూర్య ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

 ధనుస్సు

ఈరోజు
ప్రారంభించిన పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల మీద దృష్టి తగ్గించి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

మకరం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. ఏకాగ్రతతో పనిచేయండి. అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి

 కుంభం

ఈరోజు
ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

 మీనం

ఈరోజు
ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఇష్టదేవతా శ్లోకం చదవాలి. Daily Horoscope 04/11/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
గురువారం, నవంబర్ 4, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య తె3.27వరకు తదుపరి కార్తీక శుక్ల పాడ్యమి
వారం:గురువారం (బృహస్పతి)
నక్షత్రం:చిత్ర ఉ8.08 తదుపరి స్వాతి
యోగం:ప్రీతి మ12.33 తదుపరి ఆయుష్మాన్
కరణం:చతుష్పాత్ సా4.26 తదుపరి నాగవ తె3.27
వర్జ్యం: మ1.25 – 2.56
దుర్ముహూర్తం:ఉ9.51 – 10.36 & మ2.24 – 3.09
అమృతకాలం:రా10.30 – 12.01
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి: తుల
సూర్యోదయం:6.04
సూర్యాస్తమయం:5.26
దీపావళి అమావాస్య
కేదార గౌరీ వ్రతం

check Daily Horoscope 02/11/2021 :

Leave a Reply

%d bloggers like this: