Daily Horoscope 02/11/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
02, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
కృష్ణ ద్వాదశి
శరదృతువు
దక్షణాయనము భౌమ వాసరే
( మంగళ వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
ధర్మసిద్ది ఉంది. పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. గొప్పవారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదేవతాస్తుతి శుభప్రదం.
వృషభం
ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శ్రేయోదాయకం.
మిధునం
ఈరోజు
గ్రహబలం అనుకూలంగా లేదు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీసర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
కర్కాటకం
ఈరోజు
మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.
సింహం
ఈరోజు
మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.
కన్య
ఈరోజు
అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా వారి నామాన్ని జపించడం ఉత్తమం.
తుల
ఈరోజు
ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.
వృశ్చికం
ఈరోజు
మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయసహకారాలు అందుతాయి. ఆంజనేయ దర్శనం మంచిది.
ధనుస్సు
ఈరోజు
గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మకరం
ఈరోజు
ధర్మసిద్ధి ఉంది, సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే బాగుంటుంది.
కుంభం
ఈరోజు
మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్త. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణాల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. శని జపం అనుకూలతనిస్తుంది.
మీనం
ఈరోజు
ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. లింగాష్టకం పఠిస్తే బాగుంటుంది.
panchangam
ఓం శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, నవంబర్ 2, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిధి : ద్వాదశి ఉ8.25 తదుపరి త్రయోదశి
వారం : మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం : ఉత్తర ఉ9.47 తదుపరి హస్త
యోగం: వైధృతి సా5.29 తదుపరి విష్కంభం
కరణం: తైతుల ఉ8.25
తదుపరి గరజి రా7.46
ఆ తదుపరి వణిజ
వర్జ్యం : సా5.57 – 7.30
దుర్ముహూర్తం : ఉ8.18 – 9.04 &
రా10.28 – 11.18
అమృతకాలం: తె3.17 – 4.50
రాహుకాలం : మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం: ఉ9.00 – 10.30
సూర్యరాశి: తుల || చంద్రరాశి: కన్య
సూర్యోదయం: 6.02 || సూర్యాస్తమయం: 5.27.
ధనత్రయోదశి