Daily Horoscope 01/11/2021 :

0
Daily Horoscope 01/11/2021 :

Daily Horoscope 01/11/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

01, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
కృష్ణ ఏకాదశి
శరదృతువు
దక్షణాయనము ఇందు వాసరే
( సోమ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 01/11/2021
Daily Horoscope 01/11/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలున్నాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు పడుతుంది. లింగాష్టకం చదవాలి. Daily Horoscope 01/11/2021

 వృషభం

ఈరోజు
మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

 మిధునం

ఈరోజు
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. చేసేపనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

 కర్కాటకం

ఈరోజు
చిత్తశుద్ధితో చేసేపనులు మంచినిస్తాయి. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభాన్నిస్తుంది.

సింహం

ఈరోజు
శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమములలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.

 కన్య

ఈరోజు
మిశ్రమ కాలం. ముఖ్య పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవిని వెంకటేశ్వరుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

 తుల

ఈరోజు
మనఃసౌఖ్యం ఉంది. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా వారి నామాన్ని జపించడం ఉత్తమం. Daily Horoscope 01/11/2021

 వృశ్చికం

ఈరోజు
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవర్తలు వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకం చదవాలి

 ధనుస్సు

ఈరోజు
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. రామ నామ జపం శ్రేయోదాయకం.

 మకరం

ఈరోజు
బద్దకించకుండా పనిచేస్తే కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

 కుంభం

ఈరోజు
మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీధ్యానం మంచినిస్తుంది.

 మీనం

ఈరోజు
సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం. Daily Horoscope 01/11/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
సోమవారం, నవంబర్ 1, 2021
శ్రీప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:ఏకాదశి ఉ9.18 తదుపరి ద్వాదశి
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:పుబ్బ ఉ10.03 తదుపరి ఉత్తర
యోగం:ఐంద్రం రా7.30 తదుపరి వైధృతి
కరణం:బాలువ ఉ9.18 తదుపరి కౌలువ రా8.52 ఆ తదుపరి తైతుల
వర్జ్యం:సా5.09 – 6.44
దుర్ముహూర్తం:మ12.07 – 12.53 &
మ2.24 – 3.10
అమృతకాలం:రా2.39 – 4.14
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:6.02
సూర్యాస్తమయం: 5.27
మతత్రయ ఏకాదశి

check Daily Horoscope 18/10/2021 :

Leave a Reply

%d bloggers like this: