
Daily Horoscope 31/10/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
31, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
కృష్ణ దశమి
వర్ష ఋతువు
దక్షణాయనము భాను వాసరే
( ఆదివారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
మిశ్రమ వాతావరణం కలదు. ఉత్సాహంగా పని చేస్తే తప్ప పనులు పూర్తికావు. సమయానికి నిద్రాహారాలు అవసరం. పెద్దల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. శని ధ్యానం శుభప్రదం. Daily Horoscope 31/10/2021
వృషభం
ఈరోజు
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
మిధునం
ఈరోజు
అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచిది.
కర్కాటకం
ఈరోజు
శుభ కాలం. ప్రయత్న కార్యానుకూలత ఉన్నది. అభివృద్ధి కోసం చేసే పనులు సఫలీకృతమవుతాయి. ఆర్థిక అంశాల్లో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
సింహం
ఈరోజు
పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. బలమైన ప్రయత్నం ఫలిస్తుంది. బంధుమిత్రులతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దుర్గా దేవిని ఆరాధిస్తే మంచిది. Daily Horoscope 31/10/2021
కన్య
ఈరోజు
ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. చంచల స్వభావాన్ని వీడండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. ఈశ్వర ధ్యానం శుభప్రదం.
తుల
ఈరోజు
మంచి ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
వృశ్చికం
ఈరోజు
తోటివారి సహకారంతో పనులు పూర్తిచేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది.
ధనుస్సు
ఈరోజు
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి. చంద్ర గ్రహ ఆరాధన శుభప్రదం.
మకరం
ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి, చెడులను గమనించాలి. కీలక వ్యవహారంలో ముందుచూపు అవసరం. విష్ణు సందర్శనం శుభప్రదం.
కుంభం
ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు శుభఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనోబలం పెరగటానికి లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
మీనం
ఈరోజు
మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది. Daily Horoscope 31/10/2021
Panchangam
ఓం శ్రీ గురుభ్యోనమః 卐
ఆదివారం, అక్టోబర్ 31, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిధి : దశమి ఉ9.42 తదుపరి ఏకాదశి
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : మఖ ఉ9.50 తదుపరి పుబ్బ
యోగం: బ్రహ్మం రా9.10 తదుపరి ఐంద్రం
కరణం: భద్ర ఉ9.42
తదుపరి బవ రా9.30
ఆ తదుపరి బాలువ
వర్జ్యం : సా5.53 – 7.30
దుర్ముహూర్తం : సా3.55 – 4.41
అమృతకాలం: ఉ7.21 – 9.00 &
తె3.34 – 5.11
రాహుకాలం : సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం: మ12.00 – 1.30
సూర్యరాశి: తుల || చంద్రరాశి: సింహం
సూర్యోదయం: 6.01 || సూర్యాస్తమయం: 5.27.