
Daily Horoscope 30/10/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
30, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
కృష్ణ నవమి
వర్ష ఋతువు
దక్షణాయనము స్థిర వాసరే
( శని వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.
వృషభం
ఈరోజు
మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
మిధునం
ఈరోజు
భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.
కర్కాటకం
ఈరోజు
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం
సింహం
ఈరోజు
శుభకాలం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.
కన్య
ఈరోజు
మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.
తుల
ఈరోజు
గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు కలవు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం
వృశ్చికం
ఈరోజు
శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. శ్రీమహాగణపతి ఆరాధన చేస్తే మంచిది.
ధనుస్సు
ఈరోజు
చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.
మకరం
ఈరోజు
ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రారంభించబోయే పనుల్లో కుటుంబ సభ్యుల సహకారంతో మంచి ఫలితాలను సాధిస్తారు. శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దైవ దర్శనం శుభప్రదం.
కుంభం
ఈరోజు
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.
మీనం
ఈరోజు
మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
Panchangam
శ్రీ గురుభ్యోనమః
శనివారం, అక్టోబర్ 30, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:నవమి ఉ9.36వరకు తదుపరి దశమి
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:ఆశ్రేషఉ9.07 తదుపరి మఖ
యోగం:శుక్లం రా10.27 తదుపరి బ్రహ్మం
కరణం:గరజి ఉ9.36 తదుపరి వణిజ రా9.39 ఆ తదుపరి భద్ర
వర్జ్యం:రా9.28 – 11.07
దుర్ముహూర్తం :ఉ6.01 – 7.32
అమృతకాలం:ఉ7.26 – 9.07
రాహుకాలం:ఉ9.00 -10.30
యమగండం/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి: తుల
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:6.01
సూర్యాస్తమయం:5.27