Daily Horoscope 27/10/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
27, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
కృష్ణ షష్టి
వర్ష ఋతువు
దక్షణాయనము సౌమ్య వాసరే
( బుధ వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. శివనామస్మరణ ఉత్తమం. Daily Horoscope 27/10/2021
వృషభం
ఈరోజు
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠనం శుభప్రదం.
మిధునం
ఈరోజు
శరీర సౌఖ్యం ఉంది. ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.
కర్కాటకం
ఈరోజు
ప్రారంభించిన పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. శ్రమ అధికం అవుతుంది. శివ నామాన్ని జపించాలి
సింహం
ఈరోజు
చాలా గొప్ప శుభఫలితాలు వెలువడుతాయి. మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అంతా శుభమే జరుగుతుంది. గురు ధ్యానం చేయాలి.
కన్య
ఈరోజు
గతంలో కన్నా అనుకూలమైన సమయం. మీదైన రంగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.సూర్య నమస్కారాలు చేయడం మంచిది. Daily Horoscope 27/10/2021
తుల
ఈరోజు
మిశ్రమ కాలం. ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మంచి ఫలితాన్నిఇస్తుంది
వృశ్చికం
ఈరోజు
ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. అష్టమంలో చంద్ర సంచారం అనుకూలించట్లేదు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. ఆహార నియమాలను పాటించాలి. చంద్ర శ్లోకం చదవాలి..
ధనుస్సు
ఈరోజు
శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. *దైవారాధన మానవద్దు_*
మకరం
ఈరోజు
పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధన,ధాన్య లాభాలు ఉన్నాయి. మనస్సౌఖ్యం కలదు. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.
కుంభం
ఈరోజు
కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.
మీనం
ఈరోజు
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. శ్రీవెంకటేశ్వర సందర్శనం ఉత్తమం. Daily Horoscope 27/10/2021
Panchangam
శ్రీ గురుభ్యోనమ
బుధవారం, అక్టోబర్ 27, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:షష్ఠి ఉ6.22 తదుపరి సప్తమి
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:పునర్వసు పూర్తి
యోగం:సిద్ధం రా11.58 తదుపరి సాధ్యం
కరణం:వణిజ ఉ6.52 తదుపరి విష్ఠి రా7.08 ఆ తదుపరి బవ
వర్జ్యం :సా5.10 – 6.55
దుర్ముహూర్తం :ఉ11.21 – 12.07
అమృతకాలం:తె3.38 – 5.23
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.00
సూర్యాస్తమయం:5.30