Home PANCHANGAM Daily Horoscope 26/10/2021 :

Daily Horoscope 26/10/2021 :

0

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

26, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
కృష్ణ పంచమి
వర్ష ఋతువు
దక్షణాయనము భౌమ వాసరే
( మంగళ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 26/10/2021
Daily Horoscope 26/10/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండవలసిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది. Daily Horoscope 26/10/2021

 వృషభం

ఈరోజు
చేపట్టిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల సహకారం అందుతుంది. దుర్గాస్తుతి పఠించాలి.

 మిధునం

ఈరోజు
మనోధైర్యంతో ప్రయత్నించి కార్యాలు సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. రుణబాధ ఎక్కువ. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. శివాష్టకాన్ని చదివితే మంచిది .

 కర్కాటకం

ఈరోజు
అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకుసాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.

 సింహం

ఈరోజు
శుభకాలం. మొదలుపెట్టిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. శివ సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.

 కన్య

ఈరోజు
శ్రమఫలిస్తుంది. తోటివారి సహకారంతో ఇబ్బందులు తొలుగుతాయి. సమయానుకూలంగా ముందుకు సాగండి. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

 తుల

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి ఆలోచించి మాట్లాడాలి లేని యడల అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం చదివితే మంచిజరుగును. Daily Horoscope 26/10/2021

వృశ్చికం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గంటారు. గురుశ్లోకం చదవాలి.

 ధనుస్సు

ఈరోజు
శుభ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో అనుకున్నది దక్కుతుంది. తోటివారి సహకారం ఉంది. సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం.

మకరం

ఈరోజు
సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనా పఠించాలి.

కుంభం

ఈరోజు
ఆత్మబలంతో పోరాడి విజయం సాధిస్తారు. ధనధాన్యాభివృద్ధి కలదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. విష్ణుసహస్రనామ స్తోత్రం చదివితే మంచిది

 మీనం

ఈరోజు
సత్ఫలితాలు ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. గొప్పవారిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి. Daily Horoscope 26/10/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, అక్టోబర్ 26, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి: షష్ఠి పూర్తి
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ఆర్ధ్ర తె4.06
యోగం: శివం రా11.47 తదుపరి సిద్ధం
కరణం:గరజి సా5.2తదుపరి వణిజ
వర్జ్యం;ఉ10.56 – 12.42
దుర్ముహూర్తం:ఉ8.18 – 9.04 &
రా10.30 – 11.20
అమృతకాలం:సా5.06 – 6.51
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.00
సూర్యాస్తమయం:5.30

check Daily Horoscope 16/08/2021 :

Leave a Reply

%d bloggers like this: