Daily Horoscope 18/10/2021 :

0
70
Daily Horoscope 04/12/2021
Daily Horoscope 04/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

21, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
కృష్ణ ప్రతిపత్
వర్ష ఋతువు
దక్షణాయనము బృహస్పతి వాసరే
( గురు వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 18/10/2021
Daily Horoscope 18/10/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభాలను చేకూరుస్తుంది. Daily Horoscope 18/10/2021

 వృషభం

ఈరోజు
మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

 మిధునం

ఈరోజు
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం

 కర్కాటకం

ఈరోజు
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. రామనామ జపం శ్రేయోదాయకం.

 సింహం

ఈరోజు
సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

 కన్య

ఈరోజు
ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. లింగాష్టకాన్ని పఠిస్తే బాగుంటుంది. Daily Horoscope 18/10/2021

 తుల

ఈరోజు
ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

వృశ్చికం

ఈరోజు
మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని పోవడం ఉత్తమం. శ్రీసూక్తం విన్నా, చదివినా మంచి ఫలితాలు సాధిస్తారు.

ధనుస్సు

ఈరోజు
మిశ్రమ కాలం. ముఖ్య పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవిని, శ్రీవెంకటేశ్వరుని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

మకరం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠిస్తే బాగుంటుంది.

 కుంభం

ఈరోజు
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్త. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శని జపం అనుకూలతనిస్తుంది.

 మీనం

ఈరోజు
గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. Daily Horoscope 18/10/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
గురువారం, అక్టోబర్ 21, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:పాడ్యమి రా8.37వరకు తదుపరి విదియ
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:అశ్విని మ3.56 తదుపరి భరణి
యోగం:వజ్రం రా9.37తదుపరి సిద్ధి
కరణం:బాలువ ఉ7.58 తదుపరి కౌలువ రా8.37 ఆ తదుపరి తైతుల
వర్జ్యం:ఉ11.38 – 1.21 & రా2.23 – 4.07
దుర్ముహూర్తం:ఉ9.49 – 10.35 &
మ2.27 – 3.13
అమృతకాలం:ఉ8.12 – 9.55
రాహుకాలం :మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:5.57
సూర్యాస్తమయం: 5.34

check Daily Horoscope 27/09/2021 :

Leave a Reply