Home PANCHANGAM Daily Hororscope 20/10/2021

Daily Hororscope 20/10/2021

0
Daily Hororscope 20/10/2021
Daily Horoscope 27/06/2022

Daily Hororscope 20/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః 
శుభమస్తు 

20, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
శుక్ల పూర్ణిమ
వర్ష ఋతువు
దక్షణాయనము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

శివ రామ గోవింద నారాయణ మహాదేవా

విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్

Daily Horoscope 20/10/2021
Daily Horoscope 20/10/2021

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం

వృషభం

ఈరోజు
అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవారాధన శుభప్రదం. Daily Hororscope 20/10/2021

మిధునం

ఈరోజు
మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. సౌమ్య సంభాషణ అవసరం. దైవారాధన మానవద్దు.

కర్కాటకం

ఈరోజు
ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రీరామనామాన్ని జపిస్తే మంచిది.

సింహం

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి. Daily Hororscope 20/10/2021

కన్య

ఈరోజు
అనుకున్నది సాధిస్తారు. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా సత్పలితాలను అందుకుంటారు. ధర్మ కార్యాచరణ చేస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. విష్ణు దర్శనం శుభప్రదం

తుల

ఈరోజు
కొత్త పనులు చేపడతారు. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల శీఘ్ర ఫలితాలు సొంతం అవుతాయి. ఉత్సాహంతో ముందుకు సాగి విజయవంతమైన ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవ శ్లోకాలు చదివితే మంచిది.

వృశ్చికం

ఈరోజు
పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. ముందుచూపుతో వ్యవహరించాలి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం. Daily Hororscope 20/10/2021

ధనుస్సు

ఈరోజు
కష్టానికి తగిన ఫలితాలు సొంతం అవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించే ముందు లాభ నష్టాలను అంచనా వేసి ముందుకు సాగండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. దుర్గా దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మకరం

ఈరోజు
మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని పనిచేయండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఎవరినీ పట్టించుకోకుండా మీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. ఇబ్బందులు దరిచేరవు. సూర్య ధ్యానం శుభప్రదం.

కుంభం

ఈరోజు
పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. లక్ష్మీధ్యానం చేయండి. Daily Hororscope 20/10/2021

మీనం

ఈరోజు
శుభకాలం. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీ ప్రతిభ,పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సహకారం ఉంది. వ్యాపారంలో లాభదాయకమైన కాలం. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠించాలి.

check other posts Daily Horoscope 23/08/2021

Leave a Reply

%d bloggers like this: