Introducing Verses – చమత్కార పద్యం

0
98
Introducing Verses - చమత్కార పద్యం
Introducing Verses - చమత్కార పద్యం

Introducing Verses – చమత్కార పద్యం 

చమత్కార పద్యం

రెంటాల సాంబశివరావు గారికి నమస్కృతులతో…

యస్తే దదాతి రవ మస్య వరం దదాసి
యో వా మదం వహతి తస్య దమం విధత్సే।
ఇత్యక్షర ద్వయ విపర్యయ కేళి శీల!
కిం నామ కుర్వతి నమో న మనః కరోషి।।

ఈ శ్లోకం లో అక్షరద్వయం విపర్యం అవడం గమనించండి…

యః-ఎవ్వడైతే,

తే- నీకు,

రవం-ధ్వనిని,

దదాతి- ఇస్తాడో,

తస్య-వానికి,(రావణునికి),

వరం-వరాన్ని,

దదాసి- ఇస్తావు.

యః వా-ఎవ్వడైతే,

మదం-గర్వాన్ని,

వహతి-పూని ఉంటాడో,

తస్య-వానికి
,(యముడు,భస్మాసురుడు వంటి వాళ్ళకి),

Introducing Verses - చమత్కార పద్యం
Introducing Verses – చమత్కార పద్యం

దమం-అణచివేయుట అనే శిక్షని,

విధత్సే- విధిస్తావు కదా!

ఇతి-ఈ విధంగా,

అక్షర ద్వయ- అక్షరముల జంటను,

విపర్యయ- మార్చుట అను,
(రవం-వరం ;
మదం-దమం;
నమః-మనః)

కేళి- విలాసములో,
లోల-తేలియాడేవాడా!
ఓ దేవా! శివా!

నమః- నమస్కారం,(నమః),

కుర్వతి-చేయునట్టి (నా పట్ల),

మనః-మనస్సు పెట్టుట,(మనః)

న కరోషి-చేయవు,

కిం నామ- ఎందుకో గదా।।

జగద్ధర భట్టు అనే కవి ఈ శ్లోకంలో శివుని వ్యాజస్తుతి చేస్తున్నాడు,”ఓ దేవా! శివా! నిన్ను గురించి రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తేటప్పుడు పెద్దగా అరిచాడు.(“రవం” చేశాడు)(-అందుకే “రావణుడు”అయ్యాడు).
వానికి”వరం” ఇచ్చావు.

గర్వించిన(“మదం”తో విర్రవీగిన)రాక్షసులని అణచివేశావు (“దమం”).

ఈ విధంగా జంట అక్షరాల పదాలతో ఆటలాడుకునే లీలావిలాసము గల ఓ దేవా! పరమేశ్వరా!

అదే విధంగా నేను నీకు నమస్కరిస్తే (“నమః”) నా పట్ల నీవు ఎందుకు మనస్సు (“మనః”)పెట్టవో గదా!!

check Shankaracharya Jayanti 2021 :

Leave a Reply