Daily Horoscope 15/10/2021 :

0
215

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

15, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
శుక్ల్ దశమి
శరదృతువు
దక్షిణాయనము భృగు వాసరే
( శుక్ర వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 15/10/2021
Daily Horoscope 15/10/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మంచి ఫలితాలను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం పారాయణ శుభప్రదం. Daily Horoscope 15/10/2021

వృషభం

ఈరోజు
మాధ్యమ ఫలితాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. మీ మీ రంగాల్లో బలమైన ప్రయత్నంతో ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీధ్యానం శుభప్రదం

 మిధునం

ఈరోజు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.

 కర్కాటకం

ఈరోజు
అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువుల వ్యవహారాలలో అంటీ ముట్టనట్టుగా ఉండాలి. ప్రయాణాలు శుభప్రదం. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

 సింహం

ఈరోజు
భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.

 కన్య

ఈరోజు
స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీవిష్ణు నామ పఠనం ఉత్తమం

 తుల

ఈరోజు
ముందుచూపుతో వ్యవహరించాలి.కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు మంచి ఫలితాలను ఇస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

వృశ్చికం

ఈరోజు
శుభ కాలం. ఏ పనులు ప్రారంభించినా త్వరగా పూర్తవుతాయి. బంధు,మిత్ర సహకారం ఉంటుంది. వ్యాపార విజయాలు సిద్ధిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. Daily Horoscope 15/10/2021

 ధనుస్సు

ఈరోజు
మీ రంగంలో పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధు,మిత్రుల సహకారం లభిస్తుంది. కాలాన్ని మంచి విషయాల కోసం వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ దుర్గాధ్యానం శుభప్రదం.

మకరం

ఈరోజు
మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

 కుంభం

ఈరోజు
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

 మీనం

ఈరోజు
సర్వత్రా శుభ ఫలితాలు ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయంలో అనుకున్నది దక్కుతుంది. అర్థలాభం ఉంది. లక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది. Daily Horoscope 15/10/2021

Panchangam

పంచాంగం
తేది : 15, అక్టోబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి
(నిన్న రాత్రి 9 గం॥ 52 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 21 ని॥ వరకు)
నక్షత్రం : శ్రవణము
(నిన్న మధ్యాహ్నం 1 గం॥ 38)4 ని॥ నుంచి
ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 37 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 4 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 17 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 5 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 58 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 55 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 37 ని॥ లకు

check Daily Horoscope 29/09/2021

Leave a Reply