Mahishasuramardani Devi decoration on Indrakeeladri :

0
198
Mahishasuramardani Devi decoration on Indrakeeladri
Mahishasuramardani Devi decoration on Indrakeeladri

Mahishasuramardani Devi decoration on Indrakeeladri – ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దనీ దేవి అలంకరణ

మహిసాసుర మర్దిని దుర్గామాత విగ్రహం

దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన ‘మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు.

కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి.

మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసురా ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. పితామహా నేను అమరుణ్ణి కావాలి.

నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకల ప్రాణి కోటికి సహజ ధర్మాలు.

మహాసముద్రాలకూ , మహాపర్వతాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు.

అప్పుడు మహిషాసురుడు విధాతా అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడ్డాడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు.

కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థానమయ్యాడు.

బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు.

దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.

శివుని తేజము ముఖముగా , విష్ణు తేజము బాహువులుగా , బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది.

ఆమెకు శివుడు శూలమును , విష్ణువు చక్రమును , ఇంద్రుడు వజ్రాయుధమును , వరుణ దేవుడు పాశము , బ్రహ్మదేవుడు అక్షమాల , కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు.

ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరుసల్పింది.

మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు , మహాహనుడు , అసిలోముడు , బాష్కలుడు , బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది.

ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము , సింహరూపము , మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.

ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియబడింది.

ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటిని దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు.

ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే.

ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు.

విద్యార్థులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా. అయ్యవారికి చాలు అయుదు వరహాలు , పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు.

గృహస్తులు అయ్యవారికి ధన రూపంలోనూ , పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే.

దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ నూతన వస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అనావాయితిగా వస్తుంది.

దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది.

ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు.

సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.

మహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.

చండీ సప్తశతీ హోమము చేయవలెను.

నివేదన: చిత్రాన్నము , గారెలు , వడపప్పు , పానకము నివేదన చేయవలెను.

Mahishasuramardani Devi decoration on Indrakeeladri
Mahishasuramardani Devi decoration on Indrakeeladri

మహిషాసురమర్దిని స్తోత్రం

అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే |
భగవతి హేసితి కంఠ కుంఠుంభిని భూరి కుఠుంభిని భూరి కృతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే ||1||

సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిని హర్షరతే
త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోచని ఘోరరతే |
దనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖః నివారిణి సిందుసుతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 2 ||

అయి జగ దంబక దంబవ నప్రియ వాసవి లాసిని వాసరతే
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగని జాలయ మధ్యగతే |
మధు మధురే మధు కైటభ భంజని కైటభ భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 3 ||

అయి శరఖండ విఖందిట రుండా వితుందిట శుండా గజదిపతే
రిపు గజ గండ విదరణ కాండ పరాక్రమ శుండా m.ర్గదిపతే |
నిజ భుజ దండ నిపతిత ఖండ విపతిత ముండ భట దిపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 4 ||

అయి రణ దుర్మద శత్రు వదోదిట దుర్ధర నిర్జర శక్తిబ్ర్తే
కాతురా వికార దురిన మహాశివ దుతక్రత ప్రమతదిపతే |
దురిత దురిహ దురషయ దుర్మతి దానవదుట క్ర్తన్తమతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 5 ||

అయి శరణాగత వైరి వదువర విరా వరభాయ దయకరే
త్రిభువన మస్తక శుల విరోధి శిరోది క్ర్తమల శులకరే |
దుమిడుమి తామర దున్డుభినాడ మహో ముఖరిక్ర్త తిగ్మకరే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 6 ||

అయి నిజ హుంక్ర్తి మాత్ర నిరక్ర్త దుమ్ర విలోకాన దుమ్ర శాటే
సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజ లేట్ |
శివ శివ శుంభ నిషుంభ మహాహవ తర్పిత భూత పిశాకారాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 7 ||

ధనురను సంగ రానక్షనసంగా పరిస్ఫుర దంగా న తత్కతకే
కనక పిశంగా ప్ర్శత్క నిశంగా రసద్భాట శ్రంగా హతవ ఉకే |
కర్త కాతురంగా బలక్షితి రంగ ఘటద్బహురంగా ర తడ్బతుకే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 8 ||

జాయ జాయ జప్య జయేజయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుటే
భాన భాన భిన్జిమి భిన్క్ర్త నుపుర సింజిత మోహిత భుతపతే |
నటిత నటర్ధ నటి నట నాయకా నటిత నాట్య సుగానరాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 9 ||

అయి సుమన్ సుమన్ సుమన్ సుమన్ సుమనోహర కంటియుటే
శ్రిత రజని రజని రజని రజని రాజనికర వక్త్రవ్ర్తే |
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరదిపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 10 ||

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రాల్లక మల్లరాటే
విరచిత వల్లిక పల్లిక మల్లికా భిల్లిక భిల్లిక వర్గ వ్ర్తే |
సితక్ర్త పుల్లిసముల్ల సితరున తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 11 ||

అవిరాల గండ గలన్మడ మేదుర మత్త మతన్గజ రాజపతే
త్రిభువన భూషణ భూత కళానిధి రూపా పయోనిది రాజసుటే |
అయి సుద తిజన లలసమనస మోహన మన్మథ రాజసుటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 12 ||

కమల దళామల కోమల కాంతి కలాకలితమాల బాలలతే
సకల విలాస కలనిలయక్రమ కేలి కాలత్కల హంస కులే |
అలికుల సంకుల కువాలయ మండల ములిమిలద్భాకులాలి కులే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 13 ||

కర మురళి రవ విజిత కుజిత లజ్జిత కోకిల మంజుమతే
మిలిత పులిండ మనోహర గుంజిత రంజితశైల నీకు న్జగాటే |
నిజగున భూత మహాశాబరిగన సద్గుణ సంభ్ర్త కేలితలే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 14 ||

కటిత త పిత దుకుల విచిత్ర మయుఖతిరస్క్ర్త కేంద్ర రుస్
ప్రణత సురాసుర ములిమనిస్ఫుర డంషుల సంనఖ కేంద్ర రుస్ |
జిత కనకకాల ములిపదోర్జిత నిర్భర కుంజర కుమ్భాకుస్
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 15 ||

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుటే
కర్త సురతరక సంగారతరక సంగారతరక సునుసుటే |
సురత సమాధి సమనసమది సమదిసమది సుజతరాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 16 ||

పడకమలం కరుననిలయే వరివస్యతి యోఅనుదినన్ స శివే
అయి కమలె కమలనిలయే కమలనిలయ్ స కథం న భావేట్ |
తవ పదమేవ పరంపదమిత్యనుశిలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 17 ||

కనకలసత్కల సిందు జలిరను సింసినుటే గుణ రంగాభువం
భాజాతి స కిం న శాసికుకా కుంభ తాటి పరిరంభ సుఖనుభావం |
తవ కారణం శరణం కరవని నతమరవని నివాసి శివం
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 18 ||

తవ విమలేన్డుకులం వదనేన్డుమలం శకలం నను కులయతే
కిము పురుహుట పురిండుముఖి సుముఖిభిరసు విముఖిక్రియతే |
మమ తు మతం శివనమదనే భవతి క్ర్పాయ కిముట క్రియేట్
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 19 ||

అయి మయి దినదయలుతయ క్ర్పయైవ త్వయా భావితవ్యముమే
అయి జగతో జనని క్ర్పయాసి యథాసి తతానుమితసిరాటే |
యడుసితమత్ర భావత్యురారి కురుతడురుతపమపకురుటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 20 ||

ఇతి శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం సంపూర్ణం

శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళి

ఓం మహత్యై నమః
ఓం చేతనాయై నమః
ఓం మయాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహోదరాయై నమః
ఓం మహాబుద్ధ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహా బలాయై నమః
ఓం మహా సుధాయై నమః
ఓం మహా నిద్రాయై నమః
ఓం మహా ముద్రాయై నమః
ఓం మహోదర్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహాజయాయై నమః
ఓం మహాతుష్ట్యై నమః
ఓం మహా లజ్జాయై నమః
ఓం మహా ఢృత్యై నమః
ఓం మహాఘోరాయై నమః
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం మహాకాంతాయై నమః
ఓం మహాస్మృత్యై నమః
ఓం మహాపద్మిన్యై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహా భోదాయై నమః
ఓం మహా తపసే నమః
ఓం మహా సంస్థానాయై నమః
ఓం మహారవాయై నమః
ఓం మహా రోషాయై నమః
ఓం మహాయుధాయై నమః
ఓం మహాబంధసంహార్యై నమః
ఓం మహాభయ వినాశిన్యై నమః
ఓం మహానేత్రాయై నమః
ఓం మహావక్త్రాయై నమః
ఓం మహావక్షసే నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహామహీరుహాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం మహాఛాయాయై నమః
ఓం మహానఘాయై నమః
ఓం మహాశాంత్యై నమః
ఓం మహాశ్వాసాయై నమః
ఓం మహాపర్వతనందిన్యై నమః
ఓం మహాబ్రహ్మమయై నమః
ఓం మహామాత్రవే నమః
ఓం మహాసారాయై నమః
ఓం మహాసురగ్న్యై నమః
ఓం మహత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం చర్చితానందాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాక్షాంత్యై నమః
ఓం మహాభ్రాంత్యై నమః
ఓం మహా మంత్రాయై నమః
ఓం మహీమ్యై నమః
ఓం మహామహికులాయై నమః
ఓం మహాలోలాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం మహానీలాయై నమః
ఓం మహాశీలాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాకలాయై నమః
ఓం మహాచిత్రాయై నమః
ఓం మహాసేతవే నమః
ఓం మహాహేతవే నమః
ఓం మహాయశస్విన్యై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహా సాధ్యాయై నమః
ఓం మహా సత్యాయై నమః
ఓం మహాగత్యై నమః
ఓం మహాసుఖిన్యై నమః
ఓం మహాదుఃస్వప్ననాశిన్యై నమః
ఓం మహామోక్షప్రదే నమః
ఓం మహాపక్షాయై నమః
ఓం మహీయస్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహావాణ్యే నమః
ఓం మహారోగవినాశినే నమః
ఓం మహాధారాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహామార్యే నమః
ఓం ఖేచర్యై నమః
ఓం మహాక్షేమకర్యే నమః
ఓం మహాక్షమాయై నమః
ఓం మహైశ్వర్యప్రదాయినే నమః
ఓం మహావిషఘ్న్యై నమః
ఓం విషదాయై నమః
ఓం మహాదుర్గవినాశిన్యై నమః
ఓం మహావర్షాయై నమః
ఓం మహాతత్త్వాయై నమః
ఓం మహాకైలాసవాసిన్యై నమః
ఓం మహాసుభ్రద్రాయై నమః
ఓం మహ్యై సుభగాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాసత్యే నమః
ఓం మహాప్రత్యంగిదేవతాయై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం మహాప్రళయకారిణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం మహామత్యై నమః
ఓం మహ్యై మంగళకారిణ్యై నమః
ఓం మహారమ్యై నమః
ఓం మహారాజ్యై నమః
ఓం మహా రాగిణ్యై నమః
ఓం మహా రాజరాజ సింహాసిన్యై నమః

ఇతి శ్రీ మహిషాసురమర్దని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

check Gāyatri aṣṭōttara śata nāmāvaḷi :

Leave a Reply