Daily Horoscope 11/10/2021 :

0
258

Daily Horoscope 11/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

11, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
శుక్ల్ షష్ఠి
శరదృతువు
దక్షణాయనము ఇందు వాసరే
( సోమ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 11/10/2021
Daily Horoscope 11/10/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
గొప్ప భవిష్యత్తుకై మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం. Daily Horoscope 11/10/2021

 వృషభం

ఈరోజు
ముఖ్య పనులను పూర్వాహ్ణం లోనే ప్రారంభించండి. పరిస్థితులకు తగ్గట్టు ముందుకుసాగాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మాట విలువను కాపాడుకోవాలి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం

 మిధునం

ఈరోజు
శ్రమ పెరుగుతుంది. అనుకున్నది సాధించేవరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభిస్తే మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం

 కర్కాటకం

ఈరోజు
. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. గురు ఆరాధన మేలుచేస్తుంది

 సింహం

ఈరోజు
మంచికాలం. సమయాన్ని అభివృద్ధికై వినియోగించండి. మీ ప్రతిభతో అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

 కన్య

ఈరోజు
సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టులతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మీ సందర్శనం శుభప్రదం. Daily Horoscope 11/10/2021

 తుల

ఈరోజు
అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

 వృశ్చికం

ఈరోజు
వృత్తి, ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ధనలాభం, మనఃసంతోషం కలుగుతాయి. ఓర్వలేనివారు ఉన్నారు జాగ్రత్త. సందర్భానుసారంగా ముందుకు సాగితే మేలు. అష్టలక్ష్మీ స్తుతి మంచిది.

 ధనుస్సు

ఈరోజు
అనుకున్న ఫలితాలున్నాయి. శ్రమఫలిస్తుంది. ఆర్థిక విషయాలలో పర్వాలేదనిపిస్తుంది. కీలక పనులను మధ్యాహ్నం తరువాత చేయడం ఉత్తమం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.

 మకరం

ఈరోజు
ఆప్తుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహాన్ని భంగం చేయాలనీ చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.

 కుంభం

ఈరోజు
ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తిచేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు.లక్ష్మీ ఆరాధనా మంచిది.

 మీనం

ఈరోజు
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మనోబలం సడలకుండా చూసుకోవాలి. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది. Daily Horoscope 11/10/2021

Panchangam

తేది : 11, అక్టోబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి
(నిన్న ఉదయం 8 గం॥ 56 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 6 గం॥ 32 ని॥ వరకు)
తదుపరి : షష్టి
నక్షత్రం : జ్యేష్ట
(నిన్న రాత్రి 7 గం॥ 35 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 56 ని॥ వరకు
వర్జ్యం : (ఈరోజు రాత్రి 1 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు రాత్రి 2 గం॥ 52 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 58 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 19 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 3 గం॥ 00 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 54 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 41 ని॥ లకు

check Daily Horoscope 09/10/2021 :

Leave a Reply