Ashvayuja month starts from tomorrow :

0
51
Ashvayuja month starts from tomorrow
Ashvayuja month starts from tomorrow

Ashvayuja month starts from tomorrow – రేపటి నుండి ఆశ్వయుజ మాసం ప్రారంభం  –  ఆశ్వయుజ మాసం విశిష్టత త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన……వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం !

జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం…ఆయుర్వేద దేవుడు అయిన ‘ ధన్వంతరీ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్యులు జన్మించిన మాసం.

దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది !

ఈ మాసం లోని తొలి తొమ్మిది రోజులు “దేవి నవరాత్రులు.” సంప్రదాయబద్ధంగా పూజలు చెయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి , ముగ్గురు అమ్మల మూలపుటమ్మను ఈ నాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధించాలి.

దేవి పూజను ఆశ్వీయుజ మాసం అష్టమి , నవమిలలో పూజించిన భక్తులకు ఎటువంటి శోకాలు దరిచేరవు.

దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది.

కలశ స్థాపనాదులతో పూజించలేని వారు , అమ్మవారి పటానికి గాని , విగ్రహానికి గాని , పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర , నామ పారాయణలను చేయవచ్చు.

ఈ విధముగ దేవి నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది. అంతే కాకుండా దుష్ట , గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని చెప్పబడుతోంది.

Ashvayuja month starts from tomorrow
Ashvayuja month starts from tomorrow

అలాగే , ఈ మాసం లో సప్తమి రోజున గోపూజ చెయ్యవలెను. కపిల గోవును పూజించాలని , కేవలం పంచగవ్యములను మాత్రం స్వీకరించి ఉపవాసము ఉండవలెను.

పూర్ణిమ నాడు “నారదీయ పురాణము” ను పండితులకు తాంబూలములో వుంచి దానము ఇవ్వవలేను.

పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చెయ్యటం వలన లక్ష్మిదేవి సంతోషించి , అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని శాస్త్ర వచనం.

ఈ నెలలోని బహుళ పక్షములో చతుర్దశి , అమావాస్య తిధులలో దీపాలను దేవాలయం , మఠము ప్రాకారాల్లోను , వీధులు ,

ఇంటి ముందు సాయంత్రము సమయములో వెలిగించుకోవడంవల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతోంది.

ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న మాసం ఆశ్వయుజ మాసం.

ఈ మాసం లో చేసే పూజలు , విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.

అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపములోనైనా , ఏ నామంతోనైనా ఆరాధించవచ్చు. ఆ తల్లి అమ్మలగన్న అమ్మ !.

తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి కరుణామయి..ఆ తల్లి !

check Sivapuranam – 36 – lingavirbhavam

Leave a Reply