Daily Horoscope 03/10/2021 :

0
204

Daily Horoscope 03/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

03, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
కృష్ణ ద్వాదశి
వర్ష ఋతువు
దక్షణాయనము భాను వాసరే
( ఆది వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 03/10/2021
Daily Horoscope 03/10/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
సౌభాగ్యప్రాప్తి కలదు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి సాయం చేసేవారు ఉంటారు. యశోవృద్ధి కలదు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నవదుర్గా స్తోత్రం పఠించాలి. Daily Horoscope 03/10/2021

 వృషభం

ఈరోజు
మిశ్రమకాలం. ఒత్తిడి పెరగకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాలలో మీరు ఆశించిన సాయం అందుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంకా బాగుంటుంది.

 మిధునం

ఈరోజు
ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధు,మిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. కనకధారాస్తవం పారాయణ చేయడం వల్ల బాగుంటుంది.

 కర్కాటకం

ఈరోజు
ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

సింహం

ఈరోజు
చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. జన్మరాశిలో చంద్రబలం యోగిస్తోంది. గణపతి ఆరాధన శుభప్రదం. Daily Horoscope 03/10/2021

 కన్య

ఈరోజు
కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొని పోవడం వారి పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయానికి తగినట్టు ఖర్చులు ఉంటాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

 తుల

ఈరోజు
పనిలో శ్రమ పెరిగినప్పటికీ మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం

 వృశ్చికం

ఈరోజు
మంచి కాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త మనస్సంతోషాన్ని ఇస్తుంది. ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం

ధనుస్సు

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తవ్వవు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి. మంచి జరుగుతుంది. ఆంజనేయ దర్శనం శుభప్రదం.

 మకరం

ఈరోజు
మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వార్తలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం పఠించాలి.

కుంభం

ఈరోజు
మీలోని నిబద్ధతే మిమ్మలి రక్షిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

 మీనం

ఈరోజు
మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయస్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది. Daily Horoscope 03/10/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, అక్టోబర్ 3, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:ద్వాదశి రా7.48వరకు తదుపరి త్రయోదశి
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:మఖ రా2.11వ. తదుపరి పుబ్బ
యోగం:సాధ్యం మ3.48వ తదుపరి శుభం
కరణం:కౌలువ ఉ7.46 తదుపరి తైతుల రా7.48 ఆ తదుపరి గరజి
వర్జ్యం:మ1.53 – 3.31
దుర్ముహూర్తo:సా4.11 – 4.59
అమృతకాలం:రా11.43 – 1.21
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:సింహం
సూర్యోదయం: 5.54 సూర్యాస్తమయం:5.47

check Daily Horoscope 15/08/2021 

Leave a Reply